HBD Anjali : అచ్చ తెలుగందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు…

HBD Anjali : తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్ల లోటు చాలా ఏళ్ళ నుండే ఉందన్న మాట తెలిసిందే. దాదాపు గత రెండు దశాబ్దాలుగా తెలుగు హీరోయిన్ల హడావిడి చాలా తగ్గగా, ఇప్పుడు వేళ్ళ మీద లెక్కపెట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం మెల్లిమెల్లిగా తెలుగు హీరోయిన్లకు చిన్న సినిమాల ఆదరణ పెరిగింది. కానీ ఇప్పుడున్న తెలుగు హీరోయిన్లలో అన్ని రకాల పాత్రలు వేసి నటించి మెప్పించగల తెలుగమ్మాయిలు చాలా తక్కువ. అలాంటి తెలుగు భామల్లో అచ్చ తెలుగందంలా మెప్పిస్తూ, తెలుగు సినీ అభిమానుల సీతమ్మలా మెప్పించిన హీరోయిన్ “అంజలి”. నిజానికి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాతో ప్రేక్షకులకి దగ్గరైన అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతకు ముందే పలు డబ్బింగ్ సినిమాలతో పలకరించిన అంజలి నిజానికి సీతమ్మ వాకిట్లో… సినిమా వచ్చే వరకు అంజలి తెలుగమ్మాయి అని చాలా మందికి తెలీదు. కానీ ఇప్పుడు తెలుగు హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఈరోజు ఈ అచ్చ తెలుగందం “అంజలి” (HBD Anjali) పుట్టినరోజు (జూన్ 16). ఈ సందర్బంగా తనకి బర్త్ డే విషెస్ ని అందచేస్తూ అంజలి ఫిల్మ్ జర్నీ పై ఓ లుక్కేద్దాం.

HBD Anjali Birthday Special

రచ్చ గెలిచి ఇంట గెలిచిన అంజలి..

తూర్పు గోదావరి జిల్లా రాజోలు కి చెందిన అచ్చ తెలుగమ్మాయి 1988 జూన్ 16న జన్మిచింది. సొంతూరు లోనే చిన్నతనం గడిపిన అంజలి సినిమాల్లో రాణించాలని తల్లి దండ్రుల ప్రోత్సాహంతో కెరీర్ బిగినింగ్ లోనే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది. ఆ క్రమంలో 2006 లో ఫొటో అనే సినిమాలో నటించింది అంజలి. కానీ ఆ సినిమా ఆడలేదు సరికదా, వచ్చిందని కూడా ఎవరికీ తెలీదు. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెత కు రివర్స్ గా అంజలి రచ్చ గెలిచి ఇంట గెలిచింది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి రచ్చ గెలిచి ఇంటికొచ్చి మెప్పించింది. తమిళ్ లో షాపింగ్ మాల్ అనే సినిమాతో అటు, కోలీవుడ్ లోనే కాక, డబ్బింగ్ తో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న అంజలి, మల్టి స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. అయినా ఆ తర్వాత వరుసగా అవకాశాలు రాలేదు. అందుకే నటిగా అంజలికి రావలసినంత గుర్తింపు రాలేదని తెలుగు అభిమానుల ఆవేదన. ఈ నాటికీ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి జనాన్ని మెప్పించడంలో తనకు తానే సాటి అనిపించుకుంటోంది అంజలి. టాప్ స్టార్స్ సరసన సైతం నటిస్తూ అంజలి విలక్షణమైన పాత్రల్లోనూ అద్భుత అభినయం చాటుతుంది.

- Advertisement -

ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్స్ సరసన నటిస్తుంది..

ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత వేగంగా కాకపోయినా, మెల్లిగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత అంజలి మళ్ళి వెంకటేశ్ సరసన ‘మసాల’లో నటించగా, బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’లో మురిపించింది. అలాగే రవితేజతో బలుపు లోనూ ఆడిపాడింది. అలాగే గీతాంజలి వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక శంకరాభరణం, చిత్రాంగద, నిశ్శబ్దం, వకీల్ సాబ్” చిత్రాలలో కీలక పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది అంజలి. తాజాగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి లో అద్భుతంగా నటించి మెప్పించింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో అంజలి హీరోయిన్ గా నటిస్తుంది. ముందు ముందు అంజలి మరిన్ని సినిమాలు చేయాలనీ ఫిల్మీ ఫై తరపున తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు