Crew : ఓటిటి లోకి వచ్చేస్తున్న 150 కోట్ల కామెడీ థ్రిల్లర్.. ఎందులో అంటే!

Crew : బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద గత కొంత కాలంగా సరైన సినిమాలు రావడం లేదన్న సంగతి తెల్సిందే. అప్పుడెప్పుడో సైతాన్ సినిమా ఆడగా, రీసెంట్ గా “క్రూ” అనే చిన్న సినిమా థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తో ఆడింది. బాలీవుడ్ లో దాదాపు రెండు నెలలుగా సరైన హిట్ లేకపోగా ఫైటర్ సినిమాతో ఓ మోస్తరు విజయం దక్కగా, సరైన బ్లాక్ బస్టర్ విజయం దక్కింది మాత్రం ‘సైతాన్’ సినిమాతోనే. ఆ తర్వాత అంతటి స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా క్రూ. బాలీవుడ్ నుండి ప్రముఖ స్టార్ హీరోయిన్స్ ముఖ్య పాత్రల్లో నటించిన మూవీ “క్రూ”. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ట హీరోయిన్స్ టబు , కరీనాకపూర్ అలాగే ఆది పురుష్ ఫేమ్ కృతి సనన్ లు నటించడం జరిగింది. ఫిమేల్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో వచ్చిన ‘క్రూ’ (Crew) మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 150 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.

Crew movie streaming on 24th on Netflix OTT platform

లాంగ్ గ్యాప్ తర్వాత భారీ సక్సెస్..

బాలీవుడ్ హీరోయిన్లు టబు, కరీనా కపూర్ , కృతి సనన్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ రాజేష్ ఏ. కృష్ణన్ దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ క్రూ (Crew). ఈ బాలీవుడ్ మూవీ మార్చి 29 వ తేదీన థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోగా, ఇప్పటి వరకూ 150 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇక బాలీవుడ్ లో ఈ సంవత్సరం సైతాన్ తర్వాత తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా తో సీనియర్ హీరోయిన్లు టబు, కరీనా లతో పాటు, రీసెంట్ గా వరుస ప్లాప్ లు అందుకున్న కృతి సనన్ కి కూడా మంచి హిట్ వచ్చింది.

- Advertisement -

నెట్ ఫ్లిక్స్ లో క్రూ..

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించిన కామెడీ థ్రిల్లర్ క్రూ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది. మే 24 వ తేది నుండి, అనగా రేపటి నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన “నెట్ ఫ్లిక్స్” లో ప్రసారం కానుంది. ఇక నేడు అర్ధరాత్రి నుండే ప్రీమియర్ రిలీజ్ చేస్తున్నారు నెట్ ఫ్లిక్స్ వారు. ఇక మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ బ్యానర్స్ పై నిర్మించిన ఈ చిత్రం లో దిల్జిత్ దోసంజ్, కపిల్ శర్మ లు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా విజయం తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సహా సీనియర్ హీరోయిన్లు వరుస సినిమాలతో మళ్ళీ బిజీ అయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు