Crew Movie : బాలీవుడ్ లో కుమ్ముతున్న మరో చిన్న సినిమా..

Crew Movie : ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో దాదాపు అన్ని ఇండస్ట్రీలలో పలు మంచి సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ముఖ్యంగా టాలీవుడ్ లో గత రెండు నెలలుగా నిఖార్సైన సినిమా లేక బాక్స్ ఆఫీస్ డల్ గా సాగగా, ఈ మార్చి లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ తో స్ట్రాంగ్ కం బ్యాక్ వచ్చిందని చెప్పాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ లాస్ట్ వీకెండ్ మూడు ఇండస్ట్రీలకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. టాలీవుడ్ నుండి సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి జోరు చూపించగా, మలయాళ ఇండస్ట్రీ నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సినిమా ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) కూడా మంచి కలెక్షన్లతో భారీ కలెక్షన్లు సాధిస్తుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఓ సాలిడ్ హిట్ తో ట్రాక్ లోకి వచ్చిందని తెలుస్తుంది.

హిట్టు బొమ్మగా క్రూ మూవీ..

బాలీవుడ్ లో దాదాపు రెండు నెలలుగా సరైన హిట్ లేకపోగా ఫైటర్ సినిమాతో ఓ మోస్తరు విజయం దక్కగా, సరైన బ్లాక్ బస్టర్ విజయం దక్కింది మాత్రం సైతాన్ సినిమాతోనే. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు మరో చిన్న సినిమా కూడా బాలీవుడ్ లో దుమ్ములేపుతుంది. బాలీవుడ్ నుండి ప్రముఖ స్టార్ హీరోయిన్స్ ముఖ్య పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ క్రూ. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ట హీరోయిన్స్ టబు , కరీనాకపూర్ అలాగే ఆది పురుష్ ఫేమ్ కృతి సనన్ ల కాంబోలో ఫిమేల్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో వచ్చిన ‘క్రూ’ (Crew Movie) మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

వీకెండ్ జోరు..

అయితే క్రూ సినిమా చిన్న సినిమానే అవ్వడంతో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చినా కూడా గొప్ప అనుకుంటే, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకుంది. మొదటి రోజు 10.28 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా, రెండో రోజు 10.87 కోట్లు, మూడో రోజు సినిమా 11.45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని వీకెండ్ లో మొత్తం మీద 32.60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా, ఇంకా ఓవర్సీస్ లో 22 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా, వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా దాదాపు 60 కోట్ల లోపు గ్రాస్ తో ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది. అయితే చిన్న సినిమా అనుకున్నా సెన్సేషనల్ కలెక్షన్స్ తో క్రూ సినిమా దూసుకుపోతూ ఉండటం విశేషమని చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా మంచి హోల్డ్ ని ఇలానే కొనసాగిస్తే లాంగ్ రన్ లో 100 కోట్ల రేంజ్ మార్క్ ని పది రోజుల్లోపే అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు