Mehar Ramesh : మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏప్రిల్ ఫూల్ చేసాడు

Mehar Ramesh : తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా తీశారు. అయితే కొంతమంది దర్శకులు ఎన్నో సినిమాలు తీసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించిన సినిమా కనీసం వాళ్ళ కెరియర్ లో ఒకటైన ఉంటుంది. ఒక సినిమా డిజాస్టర్ గా మిగిలితే రెండో సినిమాకి అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు. ఆ వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి ఆ దర్శకుడు నానా కష్టాలు పడాలి.

ఇకపోతే చాలామంది మొదటి సినిమాతోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని దర్శకులుగా స్థిరపడ్డారు. పొరపాటున ఒకటో సినిమా ఫెయిల్ అయిన కూడా రెండవ సినిమాతో తమ స్థితిని ఇండస్ట్రీలో నిలబెట్టుకున్నారు. షాక్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ శంకర్ కి మొదటి సినిమా షాక్ ఇచ్చింది. కానీ రెండవ సినిమా మిరపకాయ్ తో తన ఘాటు ఏంటో చూపించాడు. ఆ తర్వాత చేసిన గబ్బర్ సింగ్ సినిమా కొత్త రికార్డులకు తెరతీసింది.

ఇకపోతే దాదాపు ఒక ఐదు డిజాస్టర్ సినిమాలు చేసిన ఒక దర్శకుడికి ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అతను మరెవరో కాదు మెహర్ రమేష్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. అంతకంటే ముందు బాబి అనే సినిమాలో నటుడుగా కనిపించాడు. ఆ తర్వాత తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలను దర్శకుడుగా తెరకెక్కించాడు మెహర్. అయితే తెలుగులో మాత్రం ఎన్టీఆర్ తో మొదటి సినిమాను చేశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది.

- Advertisement -

ఆ తర్వాత ప్రభాస్ హీరోగా బిల్లా అనే సినిమాను చేశాడు మెహర్. అయితే ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేదు కానీ ఒక దర్శకుడుగా మాత్రం మెహర్ కి మంచి పేరుని తీసుకొచ్చింది. ప్రభాస్ ని చూపించే విధానం, స్టైలిష్ మేకింగ్ ఇవన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఆ తర్వాత మెహర్ రమేష్ చేసిన సినిమా శక్తి. శక్తి సినిమా గురించి ఎంత మాట్లాడినా కూడా మనకున్న శక్తి సరిపోదు అని చెప్పొచ్చు.

ఈ సినిమా మామూలు అంచనాలతో రిలీజ్ కాలేదు. వైజయంతి బ్యానర్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా కాసులు వర్షం కురిపిస్తుందని అందరూ నమ్మారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్లో ఇంతకుముందు ఎన్నడు ఎన్టీఆర్ ని చూడని విధంగా ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు. ఎక్కడో చూసామే అన్నట్లు ఉంటుంది కానీ అది కాదు అంటూ మెహర్ ఈ సినిమాను లేపిన విధానం మామూలుది కాదు. అయితే ఈ సినిమాలో సంబంధించి మెహర్ స్పీచ్ చూసి చాలామంది సినిమా పైన అంచనాలను విపరీతంగా పెంచుకున్నారు.

ఇకపోతే ఈ సినిమా 2011 న ఏప్రిల్ 1న రిలీజ్ అయింది. ఇకపోతే ఏప్రిల్ ఫస్ట్ ని ఫూల్స్ డే గా అందరూ పరిగణించే విషయం తెలిసిందే. సరిగ్గా అదే రోజు మెహర్ రమేష్ ( Mehar Ramesh ) దర్శకత్వంలో వచ్చిన శక్తి సినిమా రిలీజ్ అయింది కేవలం ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు, మాత్రమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ కూడా నేటికీ ఫూల్స్ గా మారి 13 ఏళ్లు అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు