The Goat Life Movie : సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా!

The Goat Life Movie : గత కొన్నాళ్లుగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అని సినిమాల ఇండస్ట్రీలు చల్లబడగా, మలయాళం ఇండస్ట్రీ మాత్రం వరుస విజయాలతో ఇండస్ట్రీలో దుమ్ము లేపుతుంది. దాదాపు రెండు నెలలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ ఇండస్ట్రీ వరుస పెట్టి 100 కోట్ల బ్లాక్ బస్టర్స్ తో దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉండగా, ఇప్పుడు లేటెస్ట్ గా మరో సెన్సేషనల్ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దాదాపు పదేళ్ల పాటు కష్టపడి నటించి నిర్మించిన సినిమా ‘ది గోట్ లైఫ్’ (ఆడుజీవితం). మార్చి 28న గ్రాండ్ గా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్ములేపుతుంది. ఒక మలయాళ ఫేమస్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దుమ్ములేపుతుండడం విశేషం.

లాంగ్ వీకెండ్ లో జోరు..

ఇక ది గోట్ లైఫ్ సినిమా ఒక్క మళయాళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక్కడ టిల్లు స్క్వేర్ ఊపులో పెద్దగా పట్టించుకోకపోయినా, మల్టీప్లెక్స్ లో మాత్రం ది గోట్ లైఫ్ మంచి కలెక్షన్లను సాధిస్తుంది. ఇక మలయాళ ఇండస్ట్రీ తరుపున వరల్డ్ వైడ్ గా ఫాస్టెస్ట్ గా 50-65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఇండస్ట్రీ రికార్డులతో దుమ్ము దుమారం లేపింది. కానీ తెలుగులో టిల్లు స్క్వేర్ తో భారీ పోటిలో పెద్దగా జోరు చూపించ లేక పోయింది లేదంటే, మరో ఐదారు కోట్లు ఎక్కువగా వచ్చేవని నెటిజన్ల అభిప్రాయం. ఇక మొత్తం మీద వీకెండ్ లో ది గోట్ లైఫ్ తెలుగు లో 80 లక్షల వరకు షేర్ 1.60 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. అయితే తెలుగు లో ది గోట్ లైఫ్ సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 1.6 కోట్ల దాకా ఉండగా సినిమా 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా వర్కింగ్ డేస్ లో సినిమా కష్టపడాల్సిన అవసరం ఉంది.

మలయాళం బాక్స్ ఆఫీస్ వద్ద జోరు..

ఇదిలా ఉండగా ది గోట్ లైఫ్ (The Goat Life Movie) మలయాళం లో దుమ్ము లేపుతూ ఉండగా, వరల్డ్ వైడ్ గా సినిమా 4 రోజుల లాంగ్ వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..కేరళ – 23.80CR, తెలుగు స్టేట్స్- 1.60Cr, తమిళనాడు – 4.20Cr, కర్ణాటక రెస్ట్ ఆప్ ఇండియా కలిపి 5.30Cr, ఓవర్సీస్ లో 31.30CR సాధించగా, వరల్డ్ వైడ్ గా 66.20 కోట్లకి పైగా గ్రాస్ 29.75 కోట్ల షేర్ ని సాధించడం విశేషం. ఇక మలయాళ ఇండస్ట్రీలోనే వరల్డ్ వైడ్ గా ఫాస్టెస్ట్ 65 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది. కాగా ది గోట్ లైఫ్ సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 26 కోట్ల దాకా ఉండగా, ఈ సినిమా వీకెండ్ లోనే ఆ మార్క్ ని అందుకుని మంచి లాభాలతో దూసుకుపోతూ ఇప్పుడు 100 కోట్ల మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. అన్నీ కుదిరితే రెండో వీకెండ్ లో అడుగుపెట్టేలోపు ఆ ఫీట్ ని కూడా అందుకునే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు