Vijay deverakonda Brother : విజయ్ కి ఇంకో తమ్ముడా.. ఎవరా కుర్రాడు..!

Vijay deverakonda Brother : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకప్పుడు చిన్నచిన్న పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించి భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక తర్వాత పెళ్లిచూపులు అనే సినిమాతో హీరోగా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోని స్టార్ హీరో అయిపోయారు.. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో యువతకు బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పాలి. ప్రస్తుతం అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు దక్కించుకున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు విజయ్..

విజయ్ లాగే మరో హీరో..

ఈ సందర్భంగా జీ తెలుగు ఛానల్ నిర్వహించిన ఒక ఫెస్టివల్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. అక్కడ చాలామంది సీరియల్ స్టార్స్ విజయ్ దేవరకొండ తో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఇకపోతే అందరిలాగే అమ్మాయి గారు సీరియల్ హీరో యశ్వంత్ గౌడ కూడా విజయ్ దేవరకొండ తో ఫోటో తీసికొని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ..దీంతో ఈ ఫోటో చూసిన నెటిజన్లంతా ఇద్దరు ఒకేలా ఉన్నారు. విజయ్ దేవరకొండ కి బ్రదర్ ( Vijay deverakonda Brother ) లా ఉన్నారే.. సేమ్ టు సేమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.. అయితే ఎవరు కామెంట్లు పెట్టారనే విషయం పక్కన పెడితే విజయ్ కి యశ్వంత్ కి కాస్త దగ్గర పోలికలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు..

నెటిజెన్స్ కామెంట్స్..

గతంలో కూడా యశ్వంత్ పెట్టిన ఫోటోలు వీడియోలు కింద మీరు విజయ్ దేవరకొండలా ఉంటారంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీనికి యశ్వంత్ కూడా ఎన్నోసార్లు రిప్లై ఇచ్చారు.. ఇక ఇప్పుడు విజయ్ తోనే సెల్ఫీ తీసుకొని నెట్టింట ఫోటో పెట్టేసరికి ఇప్పుడు ఇది చాలా వైరల్ అవుతోంది..

- Advertisement -

యశ్వంత్ కెరియర్..

యశ్వంత్ విషయానికి వస్తే.. ఈయనది కర్ణాటక.. అక్కడ బుల్లితెరపై కన్యాకుమారి అనే సీరియల్తో పాపులర్ అయ్యారు. తెలుగులో అమ్మాయిగారు సీరియల్ తో అరంగేంట్రం చేశారు. ఇక ఈ సీరియల్ లో రాజు అనే పాత్రలో నటిస్తున్నారు యశ్వంత్..

విజయ్ దేవరకొండ కెరియర్..

ఒకప్పుడు వరుస సినిమాలతో పరవాలేదు అనిపించుకున్న విజయ్ దేవరకొండ మొన్న మధ్య లైగర్ అనే పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ను చవి చూసింది. మొన్న మధ్య వచ్చిన ఖుషి సినిమాతో భారీ క్రేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు