Family Star : హీరో పాత్రకి ఆ పేరు పెట్టడానికి కారణం అదే

Family Star : కొన్ని సినిమాలు జీవితంలో నుంచి పుడతాయి అని చెబుతుంటారు. జీవితంలో నుంచి పుట్టిన కొన్ని కథలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. కొన్ని కథలు ఊహల్లో నుంచి కూడా పుడతాయి. మాక్సిమం ప్రతి దర్శకుడు ఒక స్టోరీని రాసేటప్పుడు ఎక్కడి నుంచైనా ఇన్స్పైర్ అవ్వటం అనేది కామన్ గా జరిగే విషయం. ఇకపోతే అలా ఇన్స్పైర్ అవుతూ వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళు చూసిన పర్సనల్ లైఫ్ ని, వాళ్ళు చూసిన కాలేజ్ లైఫ్ ని దృష్టిలో పెట్టుకుని చాలా కథలు రాసి సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల రాసిన హ్యాపీ డేస్ స్టోరీ తను చూసిన కాలేజ్ లైఫ్ నుంచి బయటికి వచ్చింది. రాంగోపాల్ వర్మ చేసిన శివ సినిమా తను చూసిన కాలేజీ లైఫ్ నుంచి బయటికి వచ్చింది. సందీప్ రెడ్డి వంగ చూసిన కాలేజ్ లైఫ్ అర్జున్ రెడ్డి సినిమా ద్వారా బయటికి వచ్చింది.

ఇకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి యువత సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు పరశురాం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని తీసుకుని వచ్చింది. ఇకపోతే నారా రోహిత్ తో చేసిన సోలో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఇప్పటికీ పరశురాం కెరియర్ లో బెస్ట్ ఫిల్మ్ అంటే గీతగోవిందం అని చెప్పొచ్చు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట అనే సినిమాను చేశాడు పరుశురాం. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి మంచి కలెక్షన్స్ రాబట్టింది.

- Advertisement -

సర్కారు వారి పాట సినిమా కంటే ముందు నాగచైతన్యతో పరుశురాం సినిమా చేయాల్సి ఉంది. ఆల్మోస్ట్ కథ కూడా ఓకే అయిపోయింది. ఆ టైంలో మహేష్ బాబుతో అవకాశం రావడం వలన నాగచైతన్య పర్మిషన్ తో మహేష్ బాబు తో సినిమాను చేశాడు పరశురాం. ఆ తర్వాత నాగచైతన్య కాంబినేషన్లో పరుశురాం సినిమా ఉంటుందని అందరూ ఊహించారు. కానీ ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది అయితే నాగచైతన్య కూడా ఒక ఇంటర్వ్యూలో పరుశురాం నా టైం వేస్ట్ చేశాడంటూ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే పరశురాం విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన గీతగోవిందం సినిమాను గీత ఆర్ట్స్ నిర్మించింది. మళ్ళీ ఇదే బ్యానర్లో వీరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని ఇదివరకు అనౌన్స్ చేశారు. అయితే కొన్ని కారణాలవల్ల ఆ సినిమా ఆ బ్యానర్ లో కాకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా పరశురాం తన రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఆధారంగా చేసుకొని ఈ కథను రాశాడని తెలుస్తోంది.

ఇకపోతే విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ని మేనేజ్ చేసింది తన ఫాదర్. కాబట్టి ఈ సినిమా కథలోని హీరో పాత్రకి తన ఫాదర్ నేమ్ ని పెడదామంటూ గోవర్ధన్ అనే పేరును పెట్టారు. ఏప్రిల్ 5న ఈ ఫ్యామిలీ స్టార్ ( Family Star )సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో విజయ్ సినిమా చేయనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు