Ilayaraja biopic : భారీగా రేటు పెంచిన ధనుష్.. మామూలు రేంజ్ కాదిది..

Ilayaraja biopic : కోలీవుడ్ స్టార్ ధనుష్ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఈ ఇయర్ సంక్రాంతికి ఆల్రెడీ కెప్టెన్ మిల్లర్ తో మెప్పించిన ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కుబేర మూవీ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అలాగే స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రాయన్ సినిమా కూడా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కాకుండా అవి సెట్స్ పై ఉండగానే మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ ని కూడా మొదలు పెట్టేసాడు ధనుష్. ఈ మధ్యనే అఫిషియల్ గా అనౌన్స్ అయ్యి, కమల్ హాసన్ ఆధ్వర్యంలో ఫస్ట్ లుక్ ని కూడా లాంచ్ చేసారు మేకర్స్. ఇక ఈ సినిమా నుండి రోజుకో సెన్సేషనల్ వార్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇళయరాజా బయోపిక్ ని కెప్టెన్ మిల్లర్ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ధనుష్ భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. వివరాల్లోకి వెళితే..

ధనుష్ కెరీర్ హైయెస్ట్?

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న ఇళయరాజా (Ilayaraja biopic) బయోపిక్ ని పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ధనుష్ ఏకంగా 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ రెమ్యూనరేషన్ ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ కావడం విశేషం. అయితే ధనుష్ మార్కెట్ పరంగా ఇది ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఎంత సక్సెస్ రేట్ ఉన్నా ధనుష్ సినిమాలు వంద నుండి నూట యాభై కోట్ల లోపే వసూలు చేస్తుంటాయి. కానీ ఆ సినిమాలు నార్మల్ బడ్జెట్ తో తెరకెక్కినవి కాబట్టి అవి పర్లేదు. కానీ ధనుష్ యాభై కోట్ల రేంజ్ లో కనుక రెమ్యూనరేషన్ తీసుకుంటే తన సినిమా బడ్జెట్టే 100 కోట్లు దాటిపోతుంది. ఇక ధనుష్ ఇళయరాజా మూవీకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ లో వార్తల్లో ఎంత నిజమో తెలీదు గాని, మార్కెట్ పరంగా కాకుండా తన స్టార్ డమ్ కి ధనుష్ ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయడం సబబేనని ట్రేడ్ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇళయరాజా బయోపిక్ లో పాన్ ఇండియా భాషల నటీనటులు టెక్నిషియన్స్ అతిథి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైనా కూడా ధనుష్ నటిస్తున్న కుబేర, రాయన్ సినిమాల రిలీజ్ తర్వాతే ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇక ధనుష్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సార్ తో మెప్పించగా, ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ తో పలకరించాడు, అయితే అది యావరేజ్ గా ఆడింది. ఇక ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మూడు సినిమాలు కాకుండా మరో రెండు ప్రాజెక్టులు కూడా ధనుష్ లైన్లో పెట్టాడు. అందులో ఒక హిందీ సినిమా కూడా ఉందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు