Allu Arjun Atlee : హీరోయిన్ ఫిక్స్ అయినట్టేనా.?

Allu Arjun Atlee : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో అల్లు అర్జున్ కూడా ఒకరు అని చెప్పొచ్చు. గంగోత్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అల్లు అర్జున్ ఆర్య సినిమాతోనే తనదైన శైలిని చూపించి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత మంచి విభిన్నమైన సినిమాలను ఎన్నుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని వచ్చినా కూడా నేడు అల్లు అర్జున్ కి ఒక సెపరేట్ ఆర్మీ ఉంది అని చెప్పొచ్చు.

అయితే అల్లు అర్జున్ కెరియర్లో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు పుష్ప సినిమాకి ఎత్తు. పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డును తీసుకొచ్చిన సినిమా పుష్ప అని చెప్పొచ్చు. ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత తెలుగు సినిమా స్థాయిని, తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా పుష్ప. దీనికి కారణం సుకుమార్. ఇకపోతే సుకుమార్ కి అల్లు అర్జున్ కి ఉన్న రిలేషన్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే ఒక హై రేంజ్ లో ఉంటుంది. దానికి తోడు అల్లు అర్జున్ కూడా ఈ స్థాయిలో ఉండటానికి సుకుమార్ కారణమంటూ చాలా వేదికల పైన చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక తమిళ్ దర్శకుడు తో చేతులు కలపబోతున్నట్లు తెలిసిందే. తను మరెవరో కాదు అట్లీ. రాజా రాణి సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు అట్లీ. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు.

- Advertisement -

మొదటి సినిమాని చేసిన అట్లీ కి తమిళ్ లో వరుసగా స్టార్ హీరోస్ తో సినిమాలు చేసే అవకాశం దక్కింది. రాజా రాణి తర్వాత అట్లీ చేసిన మూడు సినిమాలు కూడా విజయ్ హీరోగా నటించాడు. ఇకపోతే విజయ్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలకి ఏ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టాయి.

ఇకపోతే రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో కూడా జవాన్ అనే సినిమాను తెరకెక్కించి అద్భుతమైన కలెక్షన్స్ సాధించాడు అట్లీ. ఇక్కడితో అట్లీ రేంజ్ వేరే లెవెల్లో పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు అట్లీ నుంచి సినిమా వస్తుందంటే పాన్ ఇండియా లెవెల్ లో ఎదురుచూస్తున్నారు అనడం అతిశయోక్తి కాదు. ఇకపోతే అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా అనౌన్స్ చేయనున్నారు.

ఇకపోతే అల్లు అర్జున్ తో అట్లీ ( Allu Arjun Atlee ) చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా సమంత నటించినున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే అల్లు అర్జున్ సరసన సమంత సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో నటించింది. అలానే అట్లీ దర్శకత్వం వహించిన తేరి సినిమాలో కూడా విజయ్ సరసన సమంత నటించింది. ఇప్పుడు మళ్లీ మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటే అందరూ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు