Thug life : కమల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీప్లేస్మెంట్ కుదిరింది..

Thug life : లోకనాయకుడు కమల్ హాసన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో ‘థగ్ లైఫ్’ అనే భారీ పాన్ ఇండియా రూపొందుతున్న విషయం తెలిసిందే. లాస్ట్ ఇయర్ ఎంతో గ్రాండియర్ గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ఆ మధ్య రిలీజ్ చేసిన కమల్ హాసన్ ఫస్ట్ లుక్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రంగరాజ సత్తివేళ్ నాయగన్ గా నటిస్తున్నాడు కమల్. అయితే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో పలు ఇండస్ట్రీలకు చెందిన భారీ తారాగణం నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే ఆ నటుల్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా ఈ క్రేజీ కాంబో సినిమాకు ముందు ఓకే చెప్పి ఆ తర్వాత ఒక్కొక్కరిగా సినిమా నుండి తప్పుకున్నారు.

పూర్తిగా తప్పుకున్న స్టార్స్..

ఈ సినిమాలో తమిళ్ నుండి జయం రవి, మలయాళం నుండి దుల్కర్ సల్మాన్ ని ఎంపిక చేయగా, ముందుగా దుల్కర్ సల్మాన్ డేట్ల సమస్య వల్ల డ్రాప్ అయ్యాడు. రీసెంట్ గా జయం రవి సుదీర్ఘంగా కాల్ షీట్లు సర్దుబాటు చేయలేనని చెప్పి పక్కకు వచ్చేసాడు. అయితే బయటికి వచ్చిన ఈ స్టార్ హీరోలకు రీప్లేస్ మెంట్ వెతకడం మణిరత్నంకు పెద్ద సవాల్. ఎందుకంటే మామూలుగా హీరోలనే పెట్టుకుందామంటే ఎవరో ఒకరు దొరుకుతారు, కానీ థగ్ లైఫ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాకు తగ్గట్టు ఇమేజ్ ఉన్న హీరోలైతేనే బిజినెస్ పరంగా క్రేజ్ వస్తుంది. పైగా మణిరత్నం హీరో సెలెక్షన్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయో తెలిసిందే. అలాంటిది ఆ ప్రాజెక్ట్ నుండి హీరోలు బయటికి వస్తే మళ్ళీ ఆ పాత్రలకు వేరే నటుల్ని భర్తీ చేయాలంటే కష్టమే. కానీ థగ్ లైఫ్ (Thug life) మూవీలో ఫైనల్ గా ఆయా హీరోలకి రీప్లేస్ మెంట్ గా దొరికేసారు. ఆ హీరోలు కూడా మణిరత్నం తో ఇంతకు ముందు పనిచేసినవారే కావడం విశేషం.

కమల్ కోసం ‘నవాబ్’ గ్యాంగ్ రిపీట్..

థగ్ లైఫ్ సినిమాలో తప్పుకున్న హీరోల పాత్రల రీప్లేస్మెంట్ సెలక్షన్ జరిగిపోయిందని తాజా సమాచారం. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ శింబు, అలాగే ధ్రువ ఫేమ్ అరవింద్ స్వామి రీప్లేస్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా నుండి తప్పుకున్న దుల్కర్ సల్మాన్ పాత్రలో శింబు, అలాగే జయం రవి పాత్రకు అరవింద్ స్వామి రీప్లేస్ మెంట్ అయ్యారని తెలుస్తుంది. ఇక అరవింద్ స్వామి, శింబు మణిరత్నం కాంబోలో ఇదివరకే ‘నవాబ్’ అనే మాస్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ థగ్ లైఫ్ కోసం ఈ కాంబో రిపీట్ అవుతుంది. ఇక థగ్ లైఫ్ సినిమాలో త్రిష, గౌతమ్ కార్తీక్, నాజర్, అభిరామి, జోజు జార్జ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా కమల్ హాసన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతుంది. అయితే ప్రస్తుతం ఇండియన్2 సెట్స్ లో బిజీగా ఉన్న కమల్ త్వరలోనే మణిరత్నం సినిమాలో అడుగుపెడతాడని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు