Thug Life : ప్రాజెక్ట్ ఆగిపోయి పరిస్థితి వచ్చిందా?

లోకనాయకుడు కమల్ హాసన్, కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా అంటే పాన్ ఇండియా వైడ్ గా ఎలాంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ కాంబోలో థగ్ లైఫ్ అనే సినిమా వస్తుందని తెలిసిందే. అసలు కమల్ హాసన్, దర్శక దిగ్గజం మణిరత్నం కాంబినేషన్ అంటే జనాలకు వెంటనే నాయకుడు సినిమా గుర్తొస్తుంది. ఇండియన్ సినిమా మీద అది చూపించిన ప్రభావం గురించి ఎంతో మాట్లాడుకోవచ్చు. ఒక్క తమిళ్ లోనే కాదు, తెలుగు, మళయాళంతో పాటు హిందీలో కూడా సంచలన విజయం సాధించింది ఆ సినిమా. 1987లో విడుదలైన ఆ ఆల్ టైం క్లాసిక్ సినిమా దేశదేశాలు దాటి ఎంతో ఖ్యాతిని సంపాదించింది. అయితే ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో ఇప్పటివరకూ మళ్ళీ సినిమా రాలేదు. ఎట్టకేలకు 38 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమా వస్తుందంటే ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా లాస్ట్ ఇయర్ ఎంతో గ్రాండియర్ గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ఆ మధ్య రిలీజ్ చేసిన కమల్ హాసన్ ఫస్ట్ లుక్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రంగరాజ నాయగన్ గా నటిస్తున్నాడు కమల్.

ఒక్కొక్కరిగా బయటికి!

అయితే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో పలు ఇండస్ట్రీలకు చెందిన భారీ తారాగణం నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ క్రేజీ కాంబో సినిమాకు ముందు ఓకే చెప్పి ఆ తర్వాత ఒక్కొక్కరిగా సినిమా నుండి తప్పుకుంటున్న హీరోల జాబితా పెరుగుతోంది. ముందుగా దుల్కర్ సల్మాన్ డేట్ల సమస్య వల్ల డ్రాప్ అయ్యాడు. తాజాగా జయం రవి సుదీర్ఘంగా కాల్ షీట్లు సర్దుబాటు చేయలేనని చెప్పి పక్కకు వచ్చేసినట్టు సమాచారం. తాజాగా ఓ బడా టెక్నిషియన్ కూడా బయటికి వచ్చాడని వార్తలు వస్తున్నాయి. అయితే బయటికి వచ్చిన ఈ స్టార్ హీరోలకు రీ ప్లేస్ మెంట్ వెతకడం మణిరత్నంకు పెద్ద సవాల్. ఎందుకంటే హీరోలనే పెట్టుకుందామంటే ఎవరో ఒకరు దొరుకుతారు, కానీ థగ్ లైఫ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాకు తగ్గట్టు ఇమేజ్ ఉన్న హీరోలైతేనే బిజినెస్ పరంగా క్రేజ్ వస్తుంది. అలాగే మణిరత్నం హీరో సెలెక్షన్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయో తెలిసిందే. అలాంటిది ఆ ప్రాజెక్ట్ నుండి హీరోలు బయటికి వస్తే మళ్ళీ ఆ పాత్రలకు వేరే నటుల్ని భర్తీ చేయాలంటే చాలా కష్టం.

- Advertisement -

ఇక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ అంత విజయవంతం కావడంలో స్టార్ క్యాస్టింగ్ పాత్ర చాలా కీలకమైందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మణిరత్నం కమల్ హాసన్ ఇప్పుడీ సమస్యను పరిష్కరించుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కనీసం మూడు నాలుగు నెలలు డేట్లు అవసరం ఉండటంతో చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్న స్టార్ హీరోలకు ప్రాజెక్ట్ ఓకే చెప్పడం కష్టంగా మారింది. అలా అని చిన్న హీరోలను తీసుకుంటే పాత్ర ఇమేజ్ కి, అలాగే మార్కెటింగ్ కి దెబ్బ పడే అవకాశం ఉంది. పైగా రెగ్యులర్ షూటింగ్ జరగడం లేదు. ఈ ఏడాది దీపావళికి థగ్ లీఫ్ ని విడుదల చేయాలని అనుకున్నా ఇప్పుడది సాధ్యపడేలా లేదు. ఇక ఈ సినిమాలో త్రిష, గౌతమ్ కార్తీక్, నాజర్, అభిరామి, జోజు జార్జ్ తగ్ లైఫ్ లోని ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఈ స్టార్ హీరోల పాత్రలను భర్తీ చేసేవరకూ సినిమా ఆపాలని మేకర్స్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు