Thug Life : సెట్స్ లోకి అడుగుపెట్టిన దుల్కర్?

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ కింగ్ అఫ్ కోత సినిమాతో ప్లాప్ అందుకున్నాడన్న సంగతి తెలిసిందే. అయినా సరే తన తదుపరి సినిమాలపై ఎఫెక్ట్ పడకుండా సినిమాలు చేస్తున్నాడు. పైగా స్క్రిప్ట్ సెలక్షన్స్ లో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ఇంకా టైటిల్ నిర్ణయించని మలయాళం మూవీ ఉండగా, తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇవే కాకుండా తమిళ్ లో మణిరత్నం కమల్ హాసన్ సినిమా తగ్ లైఫ్ లో నటిస్తున్నాడు.

లక్కీ భాస్కర్ షెడ్యూల్ కంప్లీట్..

దుల్కర్ సల్మాన్ గత రెండు వారాలుగా తెలుగు లో వెంకీ అట్లూరి తో చేస్తున్న లక్కీ భాస్కర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ షెడ్యూల్ లో పలు బ్యాంకు సీన్లను చిత్రకరించగా, హీరోయిన్ మీనాక్షి చౌదరితో సహా కొన్ని కీలక సన్నివేశాల్ని షూట్ చేసారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ రీసెంట్ గా పూర్తయింది. తదుపరి షెడ్యూల్ మార్చి చివరి వారం లో మొదలవుతుందని సమాచారం. అయితే దుల్కర్ సల్మాన్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ గ్యాప్ లో తాజాగా మరో సినిమా సెట్స్ లోకి ఎంటరయ్యాడు దుల్కర్.

- Advertisement -

లోకనాయకుడు కమల్ హాసన్ మణిరత్నం కాంబో లో థగ్ లైఫ్ అనే సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కమల్ హాసన్ స్వీయ నిర్మాణం లో తెరకెక్కిస్తుండడం విశేషం.ఇక ఆ మధ్యన సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కమల్ హాసన్ పై కొన్ని కీలక సన్నివేశాల్ని షూట్ చేసిన మణిరత్నం కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా సినిమాపై మంచి అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాలో కమల్ హాసన్ “రంగరాయ సత్తివేళ్ నాయగన్” అనే పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెట్స్ లోకి దుల్కర్ సల్మాన్ ఎంటరయ్యాడని టాక్. దుల్కర్ పై కొన్ని కీలక సన్నివేశాలని మణిరత్నం షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

అయితే అనూహ్యంగా దుల్కర్ తనకున్న ఇతర ప్రాజెక్ట్ ల బిజీ వల్ల మణిరత్నం ప్రాజెక్ట్ వదులుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇస్తే గాని తెలీదు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ జయం రవి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.  అలాగే ఫిమేల్ లీడ్ గా త్రిష నటిస్తుంది. ఇక థగ్ లైఫ్ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ బ్యానర్ లో కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు