Gopichand : గోపీచంద్ డిజాస్టర్ సినిమాలకు వాళ్లే కారణమా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా బ్యాడ్ లక్ తో అల్లాడిపోతున్న హీరోల్లో గోపీచంద్ ఒకరు. వరస డిజాస్టర్ లతో సతమతమవుతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం “భీమా” అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొడతానని నమ్మకంతో ఉన్న గోపీచంద్ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన గత సినిమాలు ప్లాప్ అవ్వడానికి కారణం ఎవరు? గతంలో లాగా ప్రయోగాత్మక సినిమాలు చేయకపోవడానికి రీజన్ ఏంటి? అనే ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. మరి ఇంతకీ గోపీచంద్ సినిమాలు కంటిన్యూగా డిజాస్టర్ కావడానికి కారణం ఎవరు? అంటే…

కంటిన్యూ డిజాస్టర్లు…
గోపీచంద్ ఇప్పటిదాకా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ చెప్పుకోదగ్గ హిట్లు మాత్రం వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. “తొలివలపు” అనే సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు గోపీచంద్. కానీ మొదటి మూవీనే ప్లాఫ్ అవ్వడంతో విలన్ గా అవతారం ఎత్తారు. జయం, నిజం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా తన నట విశ్వరూపాన్ని బయటపెట్టారు. ఇక నటుడిగా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత “యజ్ఞం” సినిమాతో మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ మూవీతో పాటు వరుసగా ఆంధ్రుడు, రణం వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరోగానే కొనసాగారు. ఇక ఆ తర్వాత హిట్ల కంటే ఫ్లాపులనే ఎక్కువగా తన ఖాతాలో వేసుకున్నాడు గోపీచంద్. గోలీమార్, సాహసం, లౌక్యం, జిల్ మినహా చెప్పుకోదగ్గ హిట్స్ మాత్రం రాలేదు. 2015 నుంచి ఇప్పటిదాకా దాకా గోపీచంద్ కు డిజాస్టర్ ఫేజ్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన గత మూడు సినిమాలు ఆరడుగుల బుల్లెట్, పక్కా కమర్షియల్, రామబాణం థియేటర్లలోకి ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు వెళ్లాయి అనే విషయం కూడా తెలుగు సినీ ప్రియులకు తెలియదు. దీంతో గోపీచంద్ కెరీర్ ఇక అయిపోయినట్టే అని అనుకుంటున్న సమయంలోనే “భీమా”తో హడావిడి మొదలుపెట్టాడు. ఈ మూవీతో గోపీచంద్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం అనిపిస్తుంది.

డిజాస్టర్ లకు కారణం వాళ్లే…
భీమా” మూవీ మహాశివరాత్రి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లు షురూ చేశాడు గోపీచంద్. అందులో భాగంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో అసలు గతంలో లాగా ప్రయోగాత్మక సినిమాలు ఎందుకు చేయట్లేదు అనే విషయాన్ని వెల్లడించారు. ఒకప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేసిన గోపీచంద్ ఇప్పుడు ఎందుకు కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు? అనే ప్రశ్న ఎదురవ్వగా, గోపీచంద్ స్పందిస్తూ “చాలా కథలు వస్తున్నాయి. కానీ దాన్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసే వాళ్లే కావాలి. కొంతమంది పాయింట్ బాగా చెబుతారు. అది కొంతసేపే కాబట్టి ఈజీగా చెప్పగలుగుతారు. కానీ 2 1/2 అవర్స్ ఫుల్ స్టోరీకి వచ్చేసరికి ఎక్కడో ఒక చోట మిస్ అవుతూ ఉంటారు. ఒక అరగంట స్టోరీ బాగానే ఉంటుంది. కానీ దాన్ని ఎలాబరేట్ చేసినప్పుడు మనం కరెక్ట్ గా చెప్పకపోతే ఆ అటెంప్ట్ వేస్ట్ అవుతుంది. అందుకే ఇప్పటివరకు చాలా సినిమాలు వదిలేసాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక గోపీచంద్ చెప్పిన ఈ సమాధానం విన్న తర్వాత ఆయన గత సినిమాలు ప్లాప్ అవ్వడానికి డైరెక్టర్లు స్టోరీని స్క్రీన్ పై కరెక్ట్ గా ప్రజెంట్ చేయకపోవడమే రీజన్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అనుభవంతోనే గోపీచంద్ నెక్స్ట్ సినిమాల విషయంలో ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాడు అన్నమాట. కాగా “భీమా” మార్చ్ 8న థియేటర్లలోకి రాబోతోంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు