Raviteja : ఆ విషయంలో తగ్గనంటున్న మాస్ మహారాజ్? లెక్కలు చూపిస్తున్న నిర్మాతలు?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ఆ మధ్య ధమాకా తో హిట్ ట్రాక్ లోకి ఎక్కినా, లాస్ట్ ఇయర్ రావణాసుర మొదలుకొని, టైగర్ నాగేశ్వరరావు సహా ఈ ఇయర్ ఈగల్ తో హ్యాట్రిక్ డిజాస్టర్లు అందుకున్నాడు. ఈ మూడు సినిమాలు రవితేజ మార్కెట్ ని చాలా డౌన్ చేసాయి అనుకోవచ్చు. నిజం చెప్పలంటే రవితేజ గత 15 ఏళ్లుగా ఒకే రకమైన మార్కెట్ ని అప్పట్లో రవితేజ సినిమాలంటే మినిమం గ్యారెంటీ అనిపించుకునేవి. కానీ గత పదేళ్లలో పరిస్థితులు మారాయి. వరుసగా రెండు హిట్లు కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. హిట్టు కొట్టిన ప్రతి సారి మాస్ మహారాజ్ కం బ్యాక్ ఇచ్చాడని అంటున్నా ఆ వెంటనే మళ్ళీ ప్లాపులిస్తున్నాడు. ఈ తంతు బలుపు సినిమా నుండి వస్తుంది.

డిమాండ్ తగ్గిందా?
అయితే మార్కెట్ పరంగా గత పది పదిహేనేళ్లుగా 30 కోట్ల మార్కెట్ ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఈ పదిహేనేళ్ల కాలంలో ఎంట్రీ ఇచ్చిన నాని, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా వాళ్ళ మార్కెట్ స్థాయిని చాలా పెంచుకున్నారు. కానీ రవితేజ మాత్రం ఎంతో క్రేజ్ ఫాలోయింగ్ ఉండి కూడా మార్కెట్ పెంచుకోకుండా అవే మూస ధోరణి లో సినిమాలు చేస్తున్నాడు. అప్పుడెప్పుడో ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టి 45 కోట్ల వసూళ్లు అందుకున్నాడు. కానీ ఆ హిట్ స్టేటస్ ని కంటిన్యూ చేయలేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా 30 కోట్ల బిజినెస్ ని దాటలేదంటే అర్థం చేసుకోవచ్చు.

రెమ్యూనరేషన్ ప్రాబ్లెమ్!

- Advertisement -

అయితే రవితేజ సినిమాలకి అన్నటికంటే పెద్ద ప్రాబ్లెమ్ నిర్మాతల ద్వారాలు రెమ్యూనరేషన్ ప్రాబ్లెమే అని తెలుస్తుంది. నిజానికి ఇది అందరికి తెలిసిన మ్యాటరే. ఎందుకంటే రవితేజ నిలకడైన మార్కెట్ ని కోల్పోయి చాలా ఏళ్లయింది. రవితేజ సినిమా అంటే టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ తెచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. దాంతో రవితేజ సినిమాలకి మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేక డిజాస్టర్లు అవుతున్నాయి. పైగా రవితేజ తో సినిమా తీసే నిర్మాతలు థియేట్రికల్ లాభాల్లో కాకుండా, కేవలం డిజిటల్, సాటిలైట్ రైట్స్ లో లాభాల్ని ఆశించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ అన్నిటికంటే పెద్ద సమస్య ఇంత ప్లాపుల్లో ఉన్నా రవితేజ తన రెమ్యూనరేషన్ తగ్గించకపోవడమే. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడు రవితేజ. కానీ థియేటర్ల దగ్గర కనీసం 40 కోట్ల బిజినెస్ కూడా కావడం లేదని నిర్మాతలు అంటున్నా మాస్ రాజా లెక్కచేయడం లేదట.

పైగా రీసెంట్ గా వచ్చిన సినిమాలు బోల్తా కొట్టినా, నాన్ థియేట్రికల్ మార్కెట్ డౌన్ అయినా, పారితోషికం తగ్గించుకునేందుకు ససేమీరా అంటున్నాడట మాస్ మహారాజా రవితేజ. అయితే మార్కెట్ లో డిమాండ్ కి తగ్గట్టుగా బడ్జెట్ ప్లాన్ చేస్తే మినిమం గ్యారెంటీ అవుతుందని లెక్కలు చూపిస్తున్నారు ప్రొడ్యూసర్లు. పైగా రవితేజ సినిమాలు రెమ్యూనరేషన్ తో కలిపి 50 కోట్ల వరకు బడ్జెట్ అవుతున్నాయి. అలాంటి సినిమాలకు థియేట్రికల్ బిజినెస్ పరంగా పాతిక కోట్లు కూడా మించట్లేదంటే అర్ధం చేసుకోవచ్చు. మరి రవితేజ ఇప్పటికైనా మారి కథల ఎంపిక విషయంలో, అలాగే నిర్మాతల అభ్యర్థన విషయంలో ఆలోచిస్తే బెటర్ అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు