Troll Song of UI : ఉపేంద్ర మార్క్ లో సెలబ్రిటీల ట్రోలింగ్ సాంగ్…

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ఆయన సినిమాల గురించి తెలియని సౌత్ ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు ఉపేంద్ర. అయితే హీరోగా కాకముందే సౌతిండియాలోనే ఆయన ఒక స్టార్ డైరెక్టర్. కాలానుగుణంగా సమాజాన్ని విమర్శిస్తూ, అలాగే సందేశాన్నిస్తూ రియలిస్టిక్ గా తీసే ఈయన సినిమాలంటే చాలా మంది ఇష్టపడతారు. పైగా చాలా మంది స్టార్ దర్శకులు కూడా ఉపేంద్ర ని ఇన్స్పైర్ అయ్యే డైరెక్టర్లు అయ్యామని ఇప్పటికి అంటుంటారు. పాన్ ఇండియా డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లు కూడా ఉపేంద్ర అభిమాములే.

అయితే చాలా రోజుల తర్వాత దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి UI అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఉపేంద్ర. ఈ మూవీ నుండి ఏ అప్డేట్ వచ్చినా ట్రెండ్ అయి కూర్చుంటుంది. ఆ మధ్య ఈ సినిమా నుండి వచ్చిన ‘నాది చాలా పెద్దది’ అనే సాంగ్ ప్రోమో ట్రోల్ అయినా ఎంత భీభత్సం క్రియేట్ చేసిందో తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుండి ఒక ‘ట్రోల్ సాంగ్’ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ లో ఏకంగా తెలుగు సెలబ్రిటీలు అందరిపై సెటైర్లు వేస్తూ ఉంది. అలాగే కన్నడ వెర్షన్ లో అక్కడ సెలెబ్రిటీల పై ట్రోల్ చేస్తూ సాంగ్ చేశారు. ఈ సాంగ్ మొత్తం ఉపేంద్ర మార్క్ లో ఉండి ఆకట్టుకుంటుంది.

సెలబ్రిటీ లను ట్రోల్ చేస్తూ..

- Advertisement -

ఇక పక్కా ఉపేంద్ర స్టయిల్ లో ఉన్న ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. నిజానికి ఉపేంద్ర లా సమాజంలో జరుగుతున్న విషయాలపై సెటైర్లు వేయడం మరొకరికి సాధ్యం కాదేమో? ఇంతకు ముందు వచ్చిన తన “ఉపేంద్ర” సినిమాలో కూడా అలాగే చూపించారు. ఇక ఇప్పుడు వస్తున్న ఈ UI సినిమాలో కూడా అలాంటి విషయాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ట్రోల్ సాంగ్ అని రిలీజ్ అయిన ఈ పాటలో, ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉంది? సెలబ్రిటీలు అయిపోడానికి ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ లైక్స్ కోసం ఎలాంటి పనులు చేస్తున్నారు? ఇన్నాళ్లు ఎలాంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి? ఇలాంటివన్నీ సాంగ్ లో చూపించాడు.

పాలమ్మినా నుండి కుమారి ఆంటీ దాకా..

ఇక ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిన ప్రతీ విషయాన్నీ ఈ సాంగ్ లో ప్రస్తావిస్తూ చూపించాడు. అందులో ఏ ఒక్కరినీ వదిలి పెట్టలేదు. రాజకీయ నాయకుల పాలమ్మినా.. డైలాగ్ నుంచి బర్రెలక్క దాకా, అర్జున్ రెడ్డి నుంచి కుమారీ ఆంటీ, దాకా అందరినీ టచ్ చేశాడు. ఓవరాల్ గా ఈ సాంగ్ లో సోషల్ మీడియా పేరుతో ప్రజలు చేస్తున్న వింత పనులు, చూపిస్తున్న పైత్యాన్ని ముక్కు సూటిగా ప్రశ్నిస్తూ, సెలబ్రిటీలు అంటే ట్రోలింగ్ సహజమే అంటూ సెటైర్లు వేసేశాడు.

ఇక ఈ పాట లిరిక్స్ రాసిన రాంబాబు గోసల ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా ఉపేంద్ర గట్స్ ని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే సమాజంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిపై ప్రశ్నించాలని, సినిమాలు తీయాలి అని ఎంతో మంది డైరెక్టర్స్ కి ఉండచ్చు. అయితే సమాజాన్ని ప్రశ్నించే సినిమాలు తీస్తే పలు రకాలుగా ఇబ్బంది వస్తుందేమో అన్న భయంతో ఆగిపోతారు. కానీ, ఉపేంద్ర మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్టు తీసేస్తాడు. ఇక UI చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తుండగా, మొత్తం 9 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు