Family Star Teaser talk: ‘లైగర్’ ట్రైలర్ స్టైల్లో ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్

యువత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పరశురాం. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ఆంజనేయులు సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. కానీ పరశురాం రైటింగ్ మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత నారా రోహిత్ హీరోగా చేసిన సోలో సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమాతోనే ఒక దర్శకుడుగా మంచి గుర్తింపు కూడా పరశురామ్ కి లభించింది.

ఆ తర్వాత చేసిన శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా మంచి హిట్ అయింది. కానీ ఊహించిన స్థాయిలో కమర్షియల్ గా ఆ సినిమా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత పరశురాం దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది ఆ సినిమా. అక్కడితో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు పరశురాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట అనే సినిమాను తెరకెక్కించాడు పరశురాం. ఈ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ అయింది. మహేష్ బాబుని చాలా అద్భుతంగా చూపించాడు. అప్పటివరకు ఉన్న మహేష్ బాబు లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని మిస్ అవుతున్న తరుణంలో మళ్లీ సర్కారు వారి పాట సినిమాతో బయటికి తీశాడు పరశురామ్.

- Advertisement -

ఇక ప్రస్తుతం పరశురామ్ చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ముందుగా ఈ సినిమాను గీత ఆర్ట్స్ లో చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మితమవుతుంది. అలానే నాగచైతన్యతో కూడా పరశురాం ఒక సినిమాను చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వలన పట్టాలెక్కలేదు. నాగచైతన్య కూడా పరశురాం పైన నా టైమ్ అండ్ పర్సనల్ వేస్ట్ చేశారంటే కొన్ని కామెంట్స్ కూడా చేశాడు.

ఇక పరుశురామ్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ తరుణంలో టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇదివరకే రిలీజ్ చేసిన టీజర్ కూడా కొంతమేరకు ట్రోల్ కి గురైన కూడా బాగుంది అనే ఫీల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేసిన ఈ టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయని చెప్పొచ్చు.

రిలీజ్ చేసిన ఈ టీజర్ లో మునుపెన్నడు విజయ్ దేవరకొండ కనిపించిన విధంగా ఈ సినిమాలో కనిపిస్తున్నాడని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ లోని ఒక మాస్ కమర్షియల్ యాంగిల్ ను ఇప్పటివరకు ఎవరు చూడలేదు. దానిని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు పరశురాం. ఒక నిమిషం పాటు నిడివి ఉన్న ఈ టీజర్ బిట్టు అనే బ్యాగ్రౌండ్ వాయిస్ తో, కొన్ని యాక్షన్ కట్స్ తో బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్, లవ్ తో పాటు మంచి యాక్షన్ కూడా ఈ సినిమాలో ఉండబోతుందని అర్థమవుతుంది. విజయ్ కూడా చూడ్డానికి ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. అన్ని వర్కౌట్ అయి పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు