Gaami : శివం.. ది స్పిరిట్ అఫ్ గామి.. అంచనాలు పెంచేస్తుంది..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్‍ సేన్ హీరోగా నటించిన “గామి” సినిమా ఫైనల్ గా మార్చి 8న థియేటర్లలో విడుదల అవుతుందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ప్రస్తుతం అంచనాలు వీపరీతంగా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ టెక్నికల్‍గా అద్భుతంగా ఉండటంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి. పైగా మైథలాజి రిఫరెన్స్ తో దర్శకుడు విద్యాధర్ శివరాత్రి రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఇక ఈ చిత్రం కోసం నాలుగేళ్లుగా కష్టపడ్డానని విద్యాధర్ పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో సినిమా పై అంచనాలు విపరీతంగా పెరిగిపోగా, తాజాగా ఈ చిత్రం నుంచి ‘శివమ్’ అనే పాట రిలీజ్ అయ్యి ప్రేక్షకులకున్న అంచనాలని మరింత పెంచేస్తుంది.

గామి లో ఆత్మ స్థైర్యాన్ని పెంచే పాట..

గామి మూవీ నుండి రిలీజ్ అయిన ఈ పాట ” శివం ది స్పిరిట్ అఫ్ గామి” పేరుతో రిలీజ్ అయింది. ‘నీలోని యుద్ధం శివం.. నీతోనీ యుద్ధం శివం’ అంటూ సాగే ఈ పాట ఎంతో ఇంటెన్సిటీతో ఉంది. ఈ మూవీ యొక్క థీమ్‍ను తెలిపేలా ఈ పాట ఉంది. ఇక ఈ పాటను ప్రముఖ లెజెండరీ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించారు. కాగా శ్రీమణి ఈ పాటకు లిరిక్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ నరేశ్ కుమారన్ ఈ పాటకు స్వరాలు అందించారు. ఎంతో ప్రత్యేకంగా, ఉత్తేజాన్ని పెంచేలా ఉన్న ఈ పాట యొక్క మ్యూజిక్, శంకర్ మహదేవన్ గాత్రం, అలాగే బరువైన సాహిత్యంతో ఈ పాట గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక గామి చిత్రంలో బహుశా ఈ పాట ప్రీ క్లైమాక్స్ లో వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

సాంగ్ రిలీజ్ కోసం శ్రీశైలంలో విశ్వక్ సేన్..

గామి సినిమాలో శివం పాట రిలీజ్ చేయడానికి ముందు విశ్వక్ సేన్ శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్నాడు. ఇక భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీర్వాదం తీసుకున్న విశ్వక్, పంచె కట్టులో నుదుటన నామంతో స్వామి దర్శనం చేసుకున్నాడు. ఇక గామి చిత్రంలో చాందినీ చౌదరి, ఎంజీ అభినయ్, మహమ్మద్ సమద్ కీలకపాత్రలు పోషించారు. కార్తీక్ శబరీష్ నిర్మించాడు. ఇక ఈ సినిమా కోసం గత కొన్ని రోజుల నుండి ప్రమోషన్లు చేస్తున్న చిత్ర యూనిట్ ఈ సినిమాతో భారీ విజయం సాధిస్తానని నమ్మకం తో ఉన్నాడు. ఇక మూవీ మేకర్స్ కూడా అదే నమ్మకం తో సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు.

అయితే గామి సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోగా, సోషల్ మీడియాలో గామి చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయమని, ముఖ్యంగా హిందీలో కూడా రిలీజ్ చేయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి గామి సినిమా తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుండగా, ఈ సినిమా సాధించే విజయాన్ని బట్టి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలా వద్దా అన్నది మేకర్స్ డిసైడ్ చేస్తారట.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు