Maa Kaali : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి సరికొత్త చిత్రం..

గత కొంత కాలంగా ప్రతీ సినిమా ఇండస్ట్రీ లో ఈ మధ్య నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. లాస్ట్ ఇయర్ హిందీలో ది కేరళ స్టోరీ, అలాగే మలయాళంలో 2018, ఇక ఈ ఇయర్ మంజుమ్మేల్ బాయ్స్, తాజాగా తెలుగులో ఆపరేషన్ వాలెంటైన్, హిందీలో లేటెస్ట్ గా ఆర్టికల్370 సినిమాలన్నీ నిజ జీవిత చరిత్రలో భాగమే. ఇందులో కొన్ని ప్రజలు మర్చి పోయిన యధార్థ సంఘటనలు కాగా, అందులో కొన్ని వివాదాస్పద చిత్రాలుగా రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ మంచి ప్రేక్షకాదరణని దక్కించుకున్నాయి. అయితే ఇలాంటి కథ తోనే తెలుగులోనూ సరికొత్త కథాంశం తో ఓ సినిమా తెరకెక్కుతోందని తాజాగా నిర్మాతలు అనౌన్స్ చేయడం జరిగింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో..

టాలీవుడ్ లో గత కొంత కాలంగా ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్న నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. రీసెంట్ గా ఈ బ్యానర్ లో వచ్చిన ఈగల్ కూడా ప్లాప్ అయింది. అయితే తాజాగా ఈ బ్యానర్ లో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఆ మూవీయే “మా కాళి”. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి రాబోయే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా విడుదలైన ‘మా కాళి’ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ ని పెంచింది. ఇక ఈ మోషన్ పోస్టర్ బెంగాల్ చరిత్ర నుండి తుడిచివేయబడిన ఒక చారిత్రక కథనంపై సినిమా తెరకెక్కుతుందని దీని ద్వారా తెలుస్తుంది. పోస్టర్‌లో ఒకవైపు కాళీ మాత మరియు బురఖా ధరించిన మహిళ యొక్క హైలైట్ చేయబడి ఆసక్తిని పెంచుతుంది.

- Advertisement -

సున్నితమైన అంశాలతో..

ఇక మా కాళీ సినిమా ఎంతో సున్నితమైన అంశాలను మరియు మతపరమైన ఘర్షణలకు సంబంధించిన నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తుంది. అయితే మేకర్స్ చాలా ధైర్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి రైమా సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు తెలియచేసారు మేకర్స్. దాంతో పాటు బాలీవుడ్ హీరో అభిషేక్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలియచేసారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, విజయ్ ఎలకంటి దర్శకత్వం వహిస్తున్నాడు. అనురాగ్ హల్దార్ సంగీతం అందిస్తుండగా, ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే మా కాళీ పోస్టర్ చూస్తుంటే ఆల్మోస్ట్ ది కేరళ స్టోరీ సినిమా నేపథ్యమే ఉన్నట్టు అనిపిస్తుంది. రియల్ స్టోరీ గా వచ్చిన ఆ సినిమా వివాదాల పాలు అయినా, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక మేకర్స్ ఆ సినిమా ని ప్రేరణ గా తీసుకునే మా కాళీ చిత్రాన్ని ధైర్యంగా తెరకెక్కిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మా కాళీ సినిమా నుండి చిత్ర నటీనటుల గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు