The kerala story : ఓటిటీ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న కేరళ స్టోరీ!

బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 26న రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ బాలీవుడ్ లో సృష్టించిన ప్రకంపనల గురించి తెలిసిందే. ఒక్క హిందీలోనే కాకుండా నేషనల్ వైడ్ గా అన్ని భాషల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన “ది కేరళ స్టోరీ” మూవీకి సుదీప్టో సేన్ దర్శకత్వం వహించగా, విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. యోగితా బలానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ కీలక పాత్రలు పోషించారు. కేవలం 20 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సరిగ్గా తొమ్మిది నెలల క్రితం రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపింది. దాదాపు 300 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించింది.

కేరళలోని కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పలు కాంట్రవర్సీలకు తెరలేపింది. అయితే ఈ సినిమాను థియేటర్లో వీక్షించని ఆడియన్స్ ఓటిటి రిలీజ్ గురించి ఎంతగానో ఎదురు చూసారు. కానీ పలు అడ్డంకుల కారణంగా “ది కేరళ స్టోరీ” మూవీ ఓటిటి రిలీజ్ ఇప్పటిదాకా వాయిదా పడుతూనే వచ్చింది. ఫైనల్ గా జీ5 ఓటిటి సంస్థ “ది కేరళ స్టోరీ” మూవీని మంచి ధరకు కొని, ఫిబ్రవరి 16 నుంచి జీ 5లో “ది కేరళ స్టోరీ” స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో “ది కేరళ స్టోరీ” ఓటిటిలో ప్రసారం అవుతోంది.

థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులు, కేవలం హిందీ భాషలోనే రూపొందిన ఈ మూవీని భాషరాక చూడలేకపోయిన మూవీ లవర్స్ ఇప్పుడు అన్ని భాషల్లో అందుబాటులో ఉండడంతో ఎగబడి చూస్తున్నారు. ఇక రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ది కేరళ స్టోరీ జీ5 ఓటిటి లో ఏకంగా 150 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకెళుతోంది. పలు రికార్డ్స్ బద్దలు కొడుతూ దూసుకెళ్తున్న తమ మూవీ కి ఓటిటి ఆడియన్స్ ఈ స్థాయి రెస్పాన్స్ అని అందించడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు