Nainisha Rai: తినడానికి తిండిలేక రక్తం అమ్ముకున్నా – బ్రహ్మముడి నటి..!

సాధారణంగా ఎక్కడైనా సరే పిల్లలు ఇండస్ట్రీలోకి వెళ్తాము అంటే వారి తల్లిదండ్రులు అంత సులభంగా అంగీకరించరు.. ముఖ్యంగా అమ్మాయిలు విషయంలో మరింత కఠినంగా ఉంటారు.. అయితే అమ్మాయిలు మాత్రం తాము అనుకున్న కలను నెరవేర్చుకోవడానికి తల్లిదండ్రులను కూడా కాదనుకొని ఇండస్ట్రీలోకి వచ్చి పడరాని కష్టాలు పడుతూ.. చివరికి ఎలాగోల సక్సెస్ పొందే దిశగా అడుగులు వేస్తున్నారు.. ఇక తర్వాత తమ సక్సెస్ వెనుక పడ్డ కష్టాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్రహ్మముడి నటి అప్పు కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

తెలుగులో బ్రహ్మముడి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది నటి నైనిష రాయ్.. బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ చెల్లెలు అప్పు పాత్రలో నటిస్తూ ఈ బెంగాలీ భామ పలు తెలుగు సీరియల్స్ భిన్నమైన రోల్స్ చేస్తూ బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు వంటలక్క సీరియల్ లో నెగిటివ్ రోల్ చేయగా.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం లో భాగ్యరేఖ, ఇంటిగుట్టు , హంసగీతం వంటి సీరియల్స్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది.. అలాగే ఈటీవీలో ప్రసారమైన శ్రీమంతుడు సీరియల్ లో కూడా లీడ్రోల్ చేసింది. ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించింది . అయితే నటిగా ఎదిగే క్రమంలో ఆమె పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది..

నైనిష మాట్లాడుతూ.. మా నాన్న లెక్చర్ కావడంతో యాక్ట్రెస్ అవుతాను అంటే ఒప్పుకోలేదు. దాంతో మా తల్లిదండ్రులు నన్ను బయటకు పొమ్మన్నారు . నటన మీద ఇష్టంతో వారితో విభేదించి బయటకి వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో అవకాశాలు వదులుకొని ఆకలి తీర్చుకోవడానికి.. డబ్బులు ఇస్తారని తెలిసి రక్తం కూడా అమ్ముకున్నాను.. కొన్ని సందర్భాలలో తినడానికి తిండి లేక కడుపు నింపుకోవడానికి బ్లడ్ డొనేషన్ కూడా చేశాను అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఇక నటిగా ఆఫర్ అడిగితే నాకేంటి? అంటూ అడిగేవారు.. కొంతమంది ఆఫర్ ఇచ్చాక కమిట్మెంట్ అడగడం మొదలు పెట్టేవారు.. షూటింగ్ మొదలవుతుందని.. కమిట్మెంట్ ఇవ్వాలని బలవంతం చేస్తే.. కొట్టి తప్పించుకొని వచ్చేసాను.. ఆఫర్స్ రాక తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటే తల్లిదండ్రులు ఆదరిస్తారో లేదో తెలియక చనిపోవడం మంచిదని ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను.. కానీ ఎటకేలకు ఆత్మవిశ్వాసంతో కష్టనష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను అంటూ నైనిష చెప్పుకొచ్చింది.. ఇక ఈ విషయాలు విని ఆమె అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.. అంతేకాదు ఈ స్థాయికి వచ్చినందుకు నువ్వు ఎంతో మందికి ఆదర్శం అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదేమైనా నైనిష మరింత సక్సెస్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు