Operation Valentine : వీకెండ్ లో పూర్తిగా నిరాశ…

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ నుండే అంతంత మాత్రంగా టాక్ రావడంతో ఆ టాక్ ఓపెనింగ్స్ పై తీవ్రంగా పడింది. దీంతో వరుణ్ తేజ్ సినిమాకి చాలా నిరాశ పరిచే ఓపెనింగ్స్ వచ్చాయి. అసలు చెప్పాలంటే మొదటి ఆటకే మిక్సడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా, తర్వాత ఏ దశలో కూడా సినిమా ఆపరేషన్ వాలెంటైన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోలేక పోయింది. మొత్తంమీద ఈ సినిమా వీకెండ్ ని పూర్తి చేసుకోగా, వీకెండ్ లో కనీసం ఏమైనా గ్రోత్ ఉంటుందేమో అని అనుకుంటే తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పాలి.

వీకెండ్ లెక్క ఇదే..
వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ కాగా, హిందీ లో అసలు సినిమా వచ్చినట్టు కూడా ఆడియన్స్ కి తెలియలేదు. ఇక అక్కడి వసూళ్ల గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఓపెనింగ్స్ ఏమాత్రం ఆశించిన స్థాయిలో రాకపోయినా, కనీసం వీకెండ్ లో ఏమైనా గ్రోత్ చూపిస్తుందేమో అనుకుంటే, కనీస స్థాయిలో హోల్డ్ కూడా చేయలేకపోయింది. మొదటి రెండు రోజుల్లో బిలో పార్ కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా ఆదివారం కూడా సినిమా కి ఏమాత్రం గ్రోత్ కనిపించలేదు. రెండో రోజు 72 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకున్న సినిమా మూడో వచ్చేసరికి 58 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

ఏరియా వారీగా లెక్క చూస్తే..
ఆపరేషన్ వాలెంటైన్ ఓవరాల్ గా టాక్ పరంగా యావరేజ్ టాక్ తెచ్చుకుంటే, ఓపెనింగ్స్ పరంగా హైప్ లేకపోవడం తో డిజాస్టర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇక టోటల్ గా సినిమా 3 రోజుల వీకెండ్ లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాం లో 0.85 కోట్లు, సీడెడ్ లో 0.20 కోట్లు, ఆంధ్ర లో 1.05 కోట్లు షేర్ రాబట్టగా, టోటల్ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.10Rకోట్ల షేర్ ని, 4.05 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా, ఓవర్సీస్ సహా మరో 70 లక్షల షేర్ సాధించగా, వరల్డ్ వైడ్ గా ఆపరేషన్ వాలెంటైన్ మూడు రోజుల్లో 2.80 కోట్ల షేర్ 5.45కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ తగ్గినా కూడా, బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం నిరాశ కలిగించే వసూళ్ళనే సొంతం చేసుకుంది. ఈ వీకెండ్ వసూళ్ళని బట్టి చూస్తే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకి భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. పైగా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాలు మంచి క్రేజీ బజ్ తో రిలీజ్ అవుతుండడం వల్ల ఈ సినిమాని దాదాపు తీసేసే అవకాశం ఉంది.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు