Operation Valentine : అంత కష్టపడ్డా.. పట్టుమని పది కూడా రాలేదు..

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం “ఆపరేషన్ వాలెంటైన్” మార్చి 1న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. తెలుగు తో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల కావడం జరిగింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 900 థియేటర్లలో రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ తన కెరీర్ లో ఏ సినిమా కి కూడా చేయని రేంజ్ లో ప్రమోషన్స్ చేశాడు. ముఖ్యంగా హిందీలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కోసం వరుణ్ తేజ్ నార్త్ సైడ్ హిందీ వర్షన్ కోసం ఎన్నో ప్రమోషనల్ ఈవెంట్స్ చేయడం జరిగింది.

హిందీలో భారీ ప్రమోషన్లు..
ఆపరేషన్ వాలెంటైన్ కోసం స్పెషల్ గా ముంబై వెళ్లిన వరుణ్ తేజ్ అక్కడ ఓ వారం రోజుల పాటు ఏకంగా పాతిక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు వరుణ్ తేజ్. దాంతో పాటు ఢిల్లీ కాశ్మీర్ కూడా వెళ్లి వచ్చాడు.
తెలుగు లో కూడా అన్ని చోట్లకు వెళ్లి సినిమా గురించి అందరికీ తెలిసేలా చాలా ప్రమోషన్స్ ని చేశాడు. కానీ ఇంత కష్టపడి ప్రమోషన్స్ చేసినా కూడా, రిలీజ్ తర్వాత సినిమా కి మొదటి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సడ్ టాక్ వచ్చింది. దాంతో ఆ ఇంపాక్ట్ సినిమా ఓవరాల్ గా ఓపెనింగ్స్ పై పడింది. రిలీజ్ అయ్యాక కొందరు ట్రేడ్ విశ్లేషకులు హిందీలో రిలీజ్ చేయకుండా ఉండాల్సింది అని అంటున్నారు. రిలీజ్ చేసి తమ టాలీవుడ్ పరువు పోగొట్టుకున్నట్టు అయిందేమో అని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.

బాక్స్ ఆఫీస్ పై టాక్ ఇంపాక్ట్..

- Advertisement -

ఆపరేషన్ వాలెంటైన్ టాక్ పరంగా ఎంత నిరాశపరిచినా, సినిమా ఓపెనింగ్స్ పరంగా మంచి కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో వరుణ్ తేజ్ సినిమాల్లో దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుని నిరాశ పరిచింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలతో కలిపి వరల్డ్ వైడ్ గా ఆపరేషన్ వాలెంటైన్ 1.05 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇక ఆపరేషన్ వాలెంటైన్ హిందీ వెర్షన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ ప్రమోషన్లు చేశాడన్న సంగతి తెలిసిందే. కానీ అనూహ్యంగా హిందీ కలెక్షన్స్ దారుణమైన రిజల్ట్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ ని మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. హిందీలో అంత కష్టపడి ప్రమోషన్స్ చేస్తే పట్టుమని 10 లక్షల రేంజ్ లో కూడా వసూళ్ళని సినిమా సొంతం చేసుకోలేక పోయింది. హిందీ గ్రాస్ వాల్యూ 8 లక్షల వరకు ఉండచ్చని అంచనా.

అయితే ఇంతకు ముందు వరుణ్ తేజ్ మూవీస్ అంటే మినిమమ్ ఓపెనింగ్స్ వస్తూ ఉండేవి. కానీ రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ నిరాశ పరిచే సినిమాలతో మార్కెట్ భారీగా డల్ అయింది. అయినా ఆపరేషన్ వాలెంటైన్ కోసం ఎంత కష్టపడి ప్రమోషన్స్ చేసినా కూడా మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా దక్కించుకోలేకపోయింది. మరి ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా గ్రోత్ ని చూపించే అవకాశం ఉందో లేదో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు