RC16 : చెర్రీ కోసం రెహమాన్ స్పెషల్ ఫోకస్..

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో RC16 కూడా ఒకటి. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాపై టాలీవుడ్ లో క్రేజీ అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీగా తెరకెక్కుతుందని డైరెక్టర్ అంతకు ముందే క్లారిటీ ఇవ్వడం జరిగింది. మార్చి లో ఈ సినిమా ఓపెనింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడని తెలిసిందే. రహమాన్ చాలా కాలం తర్వాత ఒక తెలుగు స్టార్ హీరో సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

చెర్రీ కోసం రహమాన్..
ఇక గతంలో మెగా ఫ్యామిలీ లో పవన్ కళ్యాణ్ కొమరం పులికి మ్యూజిక్ ఇచ్చిన రెహమాన్ మళ్ళీ రామ్ చరణ్ సినిమాకి సంగీతం ఇస్తున్నాడు. అయితే రహమాన్ ప్రస్తుతం సినిమాల సంఖ్య కూడా కాస్త తగ్గించగా, తెలుగులో మాత్రం ఈ సినిమా కోసం రహమాన్ స్పెషల్ గా టైం కేటాయిస్తున్నాడని సమచారం. పైగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడం వల్ల భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. కాబట్టి అన్న భాషల ప్రేక్షకులకి నచ్చే విధంగా ఉండాలి. అందుకే రహమాన్ రామ్ చరణ్ సినిమా కోసం బుచ్చిబాబుతో తెగ కష్టపడుతున్నాడని సమాచారం. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఏఆర్ రెహమాన్ తో బుచ్చిబాబు
నాన్ స్టాప్ గా కొన్ని మ్యూజిక్ సెట్టింగ్స్ వేసాడని తెలుస్తుంది. దాదాపుగా నెల రోజుల నుండి రహమాన్ నిరంతర మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చుని ట్యూన్స్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఇక ఇటు బుచ్చిబాబు కూడా అటు మూవీ కోసం మంచి కాస్టింగ్ ని ఆడిషన్స్ చేస్తూనే, రహమాన్ తో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తూ మంచి ట్యూన్లు సెట్ చేసే ఫాంలో ఉన్నాడు.

ఫస్ట్ లుక్ కోసం..
అయితే రామ్ చరణ్ తో సినిమా అం మాత్రమే కాకుండా, మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ RC16 కథలోని పొటెన్షియల్ ని కనిపెట్టి దానికి తగ్గట్టు రెహమాన్ ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడని సమాచారం. ఇక రహమాన్ ఇంతకు ముందు ఏ సినిమాకు ఇవ్వనంత సమయం ఈ సినిమా కోసం కేటాయిస్తున్నాడట. పైగా కేవలం పాటలే కాకుండా ఈ సినిమా థీమ్ మ్యూజిక్, బీజీఎమ్, ఓవరాల్ సౌండ్ డిజైన్ పై ఇప్పటినుండే వర్క్ చేస్తున్నారట. ఇక రామ్ చరణ్ బర్త్ డే (మార్చి27) రోజున ఒక క్రేజీ ఫస్ట్ లుక్ తో సినిమాపై హై ఇంపాక్ట్ కలిగేలా రెడీ చేస్తున్నాడని సమాచారం.

- Advertisement -

ఇకపై టాలీవుడ్ పై ఫోకస్..
మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రహమాన్ గతంలో చాలా తెలుగు సినిమాలు చేసినా ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. ఏ మాయ చేసావే లాంటి హిట్స్ ఉన్నా, అది ద్విభాషా చిత్రం కాగా, పైగా అందులో ఎక్కువ క్రెడిట్ దర్శకుడు గౌతమ్ మీనన్ తీసుకున్నాడు. పైగా ఆ రోజుల్లో తమిళ్ మోజులో పడి తెలుగు సినిమాల్ని నిర్లక్ష్యం చేసాడని కూడా ఒక టాక్ ఉంది. ఇక ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల వల్ల రెహమాన్ కాస్త చల్లబడ్డాడనేది వాస్తవం. అందుకే ఇప్పుడు తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక రహమాన్ చేస్తున్న భారీ బడా ప్రాజెక్టుల్లో RC16 కూడా ఒకటి, కాబట్టి ఈ సినిమా కోసం రహమాన్ స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నాడని సమాచారం.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు