Premalu : తెలుగులో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇదే!

టాలీవుడ్ లో ఈ వారం మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. అందులో ఒకటి గోపీచంద్ నటించిన భీమా, మరొకటి విశ్వక్ సేన్ నటించిన గామి, మరొకటి మలయాళ డబ్బింగ్ సినిమా ప్రేమలు. అయితే మొదటి రెండు సినిమాలు తెలుగు సినిమాలే కాబట్టి మన ఆడియన్స్ కి తెలుసు. కానీ ఆ డబ్బింగ్ సినిమాకి అది కూడా చిన్న సినిమాకి మన ఆడియన్స్ ఎందుకు చూస్తారు అని అడిగితే, ఆ సినిమా చూస్తారు అని చెప్పడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ముందుగా ఆ మలయాళం సినిమా ప్రేమలు గురించి మాట్లాడుకుంటే, మలయాళంలో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, ఇప్పటికి మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న “ప్రేమలు” మూవీ తెలుగు లో మార్చి 8న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. చాలా తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ అయి 80 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. లవ్& కామెడీ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నట్టు కొన్ని రోజుల కిందటే అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాగా తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.

అయితే ఈ సినిమాను తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నాడు అంటే ఈ సినిమాలో ఎంత విషయం ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రేమలు చిత్రాన్ని మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, ఇంకా దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించడం జరిగింది. ఈ చిత్రంలో నెల్సన్ కే గఫూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రేమలు చిత్రానికి గిరీశ్ AD దర్శకత్వం వహించగా, విష్ణు విజయ్ సంగీతం అందించాడు.ఇక శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షామీర్ ఖాన్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.

సినిమాకి ఇదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్..

- Advertisement -

ప్రేమలు సినిమా ఒక చిన్న లవ్&కామెడీ డ్రామాగా తెరకెక్కిన చిన్న సినిమాగా రిలీజ్ అయి మలయాళం లో భారీ కలెక్షన్లు వసూలు చేస్తుంది. అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కూడా హైదరాబాద్ లో ఇప్పటికే తెగ చూసేసారు ఆడియన్స్. ఇప్పుడు తెలుగు రిలీజ్ కోసం మరింత వెయిట్ చేస్తున్నారు. ఈ డబ్బింగ్ సినిమా కోసం ఇంతలా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే ప్రేమలు సినిమా మొత్తం హైదరాబాద్ లో షూట్ చేయడం జరిగింది. సినిమా మొత్తం కూడా ఒరిజినల్ గా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అందువల్ల సినిమా కూడా ఆల్మోస్ట్ తెలుగు సినిమా అన్న ఫీలింగ్ కలిగే ఛాన్స్ ఉంది. ఏదో కొత్త నటీనటులతో తెలుగులో తీసిన చిన్న సినిమా అనుకుని చూసేయొచ్చు. ట్రైలర్ మొత్తం కూడా హైదరాబాద్ చార్మినార్, గచ్చిబౌలి, సాఫ్ట్ వేర్ ఏరియాలే కనిపిస్తాయి. అందువల్ల మూవీకి యూత్ బాగా కనెక్ట్ అవుతారు.

ఆదిత్య హాసన్ ట్రెండీ డైలాగ్స్..

ప్రేమలు మూవీ తెలుగు వెర్షన్‍కు ఇంత హైప్ రావడానికి మరో కారణం సినిమా డైలాగ్స్. తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యాక, ఆ ట్రైలర్ చూస్తుంటే తెలుగు సినిమా గానే ఫీలింగ్ అనిపిస్తుంది. దానికి కారణం తెలుగులో ట్రెండ్ కి తగ్గట్టు రాసిన డైలాగులు. ’90s ఎ ఫ్యామీలీ స్టోరీ’ వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకు డైలాగ్స్ రాసాడు. అతను రాసిన డైలాగ్స్ ట్రెండ్‍కు తగ్గట్టు ట్రైలర్లో బాగా ఆకట్టుకోగా, ప్రేమలు తెలుగు ట్రైలర్లో విజువల్స్ కంటే డైలాగ్స్ హైలైట్స్ గా నిలిచాయి. ట్రైలర్ చూస్తున్నంత సేపు ఎక్కడా డబ్బింగ్‍ మూవీలా అనిపించలేదు. ముఖ్యంగా ట్రైలర్ల లో “ఫ్రెండ్స్ జోన్ అనేది కుమారి ఆంటీ లాంటిది రా.. పబ్లిసిటీ, పైసలు ఉంటాయి.. కానీ ప్రశాంతత ఉండదు” అంటూ ట్రెండ్ కి తగ్గట్టు చెప్ప్పిన డైలాగ్స్ హైలెట్ గా ఉంది.

హిట్టు బొమ్మ కోసం వెయిటింగ్ :

టాలీవుడ్ లో హనుమాన్ మూవీ తర్వాత మరో బ్లాక్ బస్టర్ సినిమా రాలేదని చెప్పాలి. మధ్యలో అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్, ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాలు అలరించినా, అవి ఓ మోస్తరు హిట్లు గానే నిలిచాయి. అయితే ఈ వారం రిలీజ్ అవబోయే మూడు చిత్రాలు మాత్రం వేటికవే ప్రత్యేకమైన జోనర్లలో రిలీజ్ అవుతూ హిట్టు కళ తెచ్చినట్టు కనబడుతున్నాయి. అయితే వీటిలో ప్రేమలు సినిమాకి తక్కువ ఖర్చులో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసే ఆవకాశం కనిపిస్తుంది. మరి మార్చి 8న రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుల నుండి ఎక్కువ ఆదరణ పొందుతుందో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు