Krish: క్రిష్ భార్య విడాకులు ఇచ్చిందా..?

ప్రస్తుతం హైదరాబాదులోని రాడిసన్ పబ్ లో జరిగిన రైడ్ లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ తో పాటు పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.. అయితే తనను డైరెక్టర్ వివేకానంద్ టార్గెట్ చేసి.. ఈ కేసులో ఇరికించారని అందుకే ముందస్తు బెయిల్ కోరుతున్నానని అంటూ కోర్టు ను ఆశ్రయించారు డైరెక్టర్ క్రిష్. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయగా దీనిని విచారించిన కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు ఇలా డ్రగ్స్ కేసులో వినిపించడంతో.. ఆయన భార్య రమ్య మనస్థాపం చెంది డైరెక్టర్ క్రిష్ కి పెళ్ళైన రెండేళ్లకే విడాకులు ఇచ్చినట్లు వార్తలు తెరపైకి వచ్చాయి.

2018లో విడాకులు..
2016లో రమ్య అనే డాక్టర్ ను డైరెక్టర్ క్రిష్ పెళ్లి చేసుకుని.. 2018 లో విడాకులు తీసుకున్నారు. అయితే అందుకు కారణం ఆసక్తికరంగా మారింది.. వాస్తవానికి కంచె సినిమా తర్వాత క్రిష్ ఆ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఆయనకు పెళ్లి జరిగింది.. మ్యారేజ్ తర్వాత కూడా ఆ రిలేషన్ అలాగే కొనసాగడం.. ఆ విషయం అతని భార్యకు తెలియడంతో డివోర్స్ ఇచ్చిందనే వార్తలు తెరపైకి వచ్చాయి.. అంతేకాదు 2021లో తామిద్దరం విడాకులు తీసుకున్నామంటూ కూడా క్రిష్ అలాగే ఆయన భార్య డాక్టర్ రమ్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

మళ్లీ తెరపైకి విడాకుల వార్త..
అయితే ఇప్పుడు రాడిసన్ పబ్ కేసులో చిక్కిన 9 మందితో పాటు డైరెక్టర్ క్రిష్ పేరు కూడా వినిపించడంతో ఇది అసలు కారణం అంటూ నెటిజెన్లు ఆ విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి రమ్య డాక్టర్ ఇక తన భర్త ఏం చేస్తున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు? అనే విషయాలు అన్నీ ఆమెకు తెలుస్తాయి. ఈ క్రమంలోనే అతడు డ్రగ్స్ తీసుకున్న విషయాన్ని ఆమె అప్పుడే పసిగట్టింది.. కాబట్టి ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా కంచె హీరోయిన్ అనే సాకు చెప్పి విడాకులు తీసుకున్నారు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ తెరపై వైరల్ గా మారిన ఈ వ్యాఖ్యలకు డైరెక్టర్ క్రిష్ లేదా ఆయన భార్య రమ్య స్పందించాల్సి ఉంటుంది.

- Advertisement -

సతమతమవుతున్న డైరెక్టర్ క్రిష్..
ఇకపోతే ఒకవైపు భార్య వదిలేసింది.. మరొకవైపు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో డైరెక్టర్ క్రిష్ పూర్తిస్థాయిలో మనశ్శాంతి కోల్పోయారని తెలుస్తోంది.. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాని తెరకెక్కించాల్సి ఉంది..కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమా షూటింగ్ కి డేట్ లో ఇవ్వలేకపోతున్నారు.. అటు సినిమా లేక ఇటు వ్యక్తిగత జీవితంలో ఇలాంటి సమస్యలు.. అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో ఆయన పూర్తి మనస్థాపానికి గురవుతున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఇకపోతే డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు.. కాబట్టి ఆయన పిటిషన్ నీ కోర్టు అంగీకరించిందా లేదా తెలియాలి అంటే సోమవారం వరకు ఎదురు చూడాల్సిందే. మొత్తానికైతే ఇన్ని సమస్యలను డైరెక్టర్ క్రిష్ ఎలా హ్యాండిల్ చేస్తారో అని అభిమానుల సైతం కంగారుపడుతున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు