Sreeleela : గోదాదేవి గా శ్రీలీల… ట్రెడిషనల్ డ్యాన్స్ కి ఫిదా అవ్వాల్సిందే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగమ్మాయి అయినా, ముందుగా కన్నడలో పరిచయమై, ఆ తర్వాత తెలుగులో పెళ్ళిసందడి, ధమాకా సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆ తర్వాత శ్రీలీల ఏకంగా తెలుగులో వరుసగా పది సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిందంటే ఎంత క్రేజ్ సంపాదించిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే అనూహ్యంగా శ్రీ లీల నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ వచ్చాయి. కానీ ఎట్టకేలకు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఆ సినిమాలో తన నటన, డ్యాన్సులతో అభిమానులని ఆకట్టుకుంది. అయితే శ్రీలీల డ్యాన్స్ గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి తర్వాత అంతటి పెర్ఫార్మన్స్ ఇవ్వగల హీరోయిన్ గా శ్రీ లీల పేరు తెచ్చుకుంది. బహుశా తనని మించి కూడా డాన్స్ చేస్తుందేమో. చాలా మంది హీరోలు కూడా ఆమె డ్యాన్స్ పక్కన తేలిపోతారు. ఆ రేంజ్ లో డ్యాన్స్ తో మెప్పిస్తుంది శ్రీలీల.

క్లాసికల్ డాన్సర్ శ్రీ లీల..

అయితే శ్రీ లీల సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా ఒక మంచి క్లాసికల్ డాన్సర్ అని తెలిసిందే. అయితే శ్రీ లీల సినిమాల్లోకి వచ్చాక క్లాసికల్ పెర్ఫార్మన్స్ తగ్గించేసింది. పలు ఇంటర్వ్యూలలో కూడా తను క్లాసికల్ డ్యాన్సర్ అని గతంలోనే చెప్పింది. ఇక సోషల్ మీడియాలో కూడా అక్కడక్కడా శ్రీ లీల చిన్నప్పటి క్లాసికల్ డాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా శ్రీ లీల చాలా రోజుల తర్వాత తన క్లాసికల్ డ్యాన్స్ తో శ్రీలీల అదరగొడుతుంది, అని తాజాగా మరోసారి ప్రూవ్ చేసింది.

- Advertisement -

గోదాదేవి గా శ్రీ లీల..

తాజాగా హైదారాబాద్‌లో జరిగిన సమతా కుంభ్ 2024 కార్యక్రమంలో నటి శ్రీలీల “గోదా దేవి” వేషధారణలో క్లాసికల్ డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 10 నిమిషాల పాటు తన నాట్యంతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక శ్రీలీల అద్భుతంగా అభినయించిన ఈ నృత్యం భారతనాట్యానికి సంబంధించిన కళ అని సమాచారం. ప్రస్తుతం శ్రీలీల చేసిన నాట్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క ఈ నాట్యం చూసిన ప్రేక్షకులు శ్రీ లీల ఎంత అద్భుతంగా చేసిందో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా శ్రీ లీల ఇంత అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేస్తుందా అని ఆశ్యర్య పోతున్నారు. ఇక శ్రీలీల తన క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి.. కామెంట్ చేసింది.తాను చాలా చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నానని, ఇది తన ఫేవరేట్ హాబీ అని, ఇది తనకు చాలా నేర్పించిందని, మళ్ళీ చాలా కాలం తర్వాత ఇలా పర్ఫార్మెన్స్ ఇచ్చానని పేర్కొంది. ఇక గోదాదేవిగా నిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చానని, ఒకప్పుడు తాను డ్యాన్స్ చేసేటప్పుడు నా ఫ్యామిలీ మాత్రమే చూసేవారు. ఇప్పుడు మీరంతా నా ఫ్యామిలీ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

చిన్నప్పటి మెమొరీస్ షేర్..

గోదాదేవి గా డాన్స్ చేసిన శ్రీ లీల దానితో పాటు గతంలో చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ చేసిన ఫోటోని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మళ్ళీ ఇన్నాళ్ళకి తను చేసిన క్లాసికల్ డ్యాన్స్ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక శ్రీలీల చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నట్టు సమాచారం. ఇన్నాళ్లు వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు మాత్రం కొద్దిగా స్లో అయింది. అయితే త్వరలోనే మళ్ళీ బిజీ అవనుందని సమాచారం. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ బయట షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేస్తూ కనిపిస్తుంది. అయితే శ్రీ లీల స్వతహాగా ఒక డాక్టర్ కూడా అన్న సంగతి తెలిసిందే. కాకపోతే ఇంకా ట్రైనింగ్ దశలో ఉంది. ఆ ట్రైనింగ్ లో ప్రాక్టికల్స్ కోసం శ్రీ లీల సినిమాలకి తొందరగా ఒప్పుకోవట్లేదని సమాచారం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు