Jayasudha: ఆ తప్పే రూ .100 కోట్ల నష్టాన్ని తెచ్చింది – జయసుధ

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగేటువంటి నటులలో జయసుధ కూడా ఒకరు.. దాదాపుగా నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ.. సహజ నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు సీనియర్ హీరోయిన్గా కూడా ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన జయసుధ.. ఎన్నో సూపర్ హిట్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.. హీరోయిన్గా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిన ఈమె.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలు సినిమాలలో అక్కగా , వదినగా, తల్లి పాత్రలలో కూడా నటించింది. అంతేకాదు ఈమధ్య బామ్మ పాత్రలలో కూడా నటిస్తోంది..

ఆ తప్పే రూ.100 కోట్ల నష్టాన్ని మిగిల్చింది..
ఎన్నో వందల చిత్రాలలో నటించిన జయసుధ కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని సైతం కూడబెట్టారు.. అంతేకాకుండా అంతే మొత్తంలో కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడా పోగొట్టుకుంది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలను తెలియజేసింది.. జయసుధ మాట్లాడుతూ.. తన ఆస్తులు పెరగాలంటే అదృష్టం కూడా కలిసి రావాలని.. కేవలం తన సొంత సినిమాల కారణంగానే కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయానని తెలియజేసింది జయసుధ.. చెన్నైలో ఒక ప్రాపర్టీ విషయంలో దాదాపుగా 100 కోట్ల రూపాయలు నష్టపోయానంటూ వెల్లడించింది.

కారణం ఏంటంటే..?
చెన్నైలో ఒక ప్రాంతంలో స్థలాన్ని తీసుకొని ఒక బిల్డింగ్ కట్టాను అని.. ఆ విషయం తెలిసి చాలా మంది తనని ప్రశంసించారని.. ముఖ్యంగా శోభన్ బాబు అయితే తనని మరీ అభినందించారని వెల్లడించింది. అయితే ఆ తర్వాత వచ్చిన పరిణామాల కారణంగా ఆ బిల్డింగ్ రెంట్ కు కూడా అసలు పోలేదట.. దీంతో ఆ బిల్డింగ్ ని కూడా అమ్మేయాల్సి వచ్చిందని.. అప్పుడు అమ్మకుండా ఉండి ఉంటే ఇప్పుడు కొన్ని వందల కోట్లు నా సొంతం అయ్యేవి అని వెల్లడించింది. అలాగే ఇంకొక చోట కూడా తొమ్మిది ఎకరాలు భూమిని కొన్నానని.. కానీ అక్కడి నేలలో బోర్ వేస్తే అసలు నీళ్లే పడలేదని దాంతో అమ్మేశానని వెల్లడించింది.

- Advertisement -

రజినీకాంత్ ఫామ్ హౌస్ పక్కనే స్థలం..
ఇప్పుడు దాని విలువ రూ.100 కోట్లకు పైగానే.. ఉందని ఆ స్థలానికి ఆనుకొని రజినీకాంత్ యొక్క ఫామ్ హౌస్ కూడా ఉన్నదంటూ వెల్లడించింది.. ఇలా తాను కోల్పోయిన రూ.100 కోట్ల ఆస్తులు వివరాలను కూడా వెల్లడించింది.

జయసుధ వ్యక్తిగత విషయానికి వస్తే..
ఇక ఆమె పర్సనల్ విషయాలను తెలియజేస్తూ నా అసలు పేరు సుజాత అని.. అయితే నా పేరు వెండితెర మీద సరిగ్గా లేదని .. తమిళ డైరెక్టర్ రచయిత గుహనాథన్ నా పేరును జయసుధ గా మార్చారు… జ్యోతి అనే చిత్రంతో నా కెరీర్ ముందుకు వెళ్లింది అంటూ తెలిపింది.. శ్రీదేవి , జయప్రద వంటి హీరోయిన్లతోనే తనకు ప్రత్యేకమైన బంధం ఉందని..వాళ్లతో నటించిన సినిమాలలో కూడా తనకు అవార్డులు వచ్చాయని వెల్లడించింది..

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు