Premalu Telugu Trailer Talk : మనవాళ్ళకి నచ్చేలా.. ప్రామిసింగ్ గా..

మలయాళంలో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న “ప్రేమలు” మూవీ ఈ మధ్య తెలుగులో కూడా తెగ వైరల్ అవుతుంది. చాలా తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లవ్ స్టోరీ, ఇంకా కామెడీ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తూ ఉండగా, మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే 80 కోట్లకు పైగా వసూలు చేసి ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కి రెడీ అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందటే అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాగా, ఈ ప్రేమలు చిత్రాన్ని తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు సినిమాలానే..

మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగు ట్రైలర్ కాసేపటి కిందటే రిలీజ్ అవగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే ఈ సినిమాలో వేరే ఊరి నుంచి హైదరాబాద్ వచ్చే సచిన్ సంతోష్ .. హైదరాబాద్‍లో జరిగిన ఓ పెళ్లిలో రేణు ను చూసి ఇష్టపడతాడు. ఈ విషయాన్ని రైలులో రేణుకు చెప్పేందుకు సచిన్ ప్రయత్నించినా, రేణు నిద్రలో ఆ మాట వినదు. ఈ సీన్‍తో ట్రైలర్ మొదలవగా, రేణును ప్రేమలో పడేసేందుకు హైదరాబాద్‍లోనే గేట్ కోచింగ్ తీసుకునేందుకు సచిన్ డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో సచిన్, రేణు ఫ్రెండ్స్ అవుతారు. అయితే, వాళ్ల ఐటీ కంపెనీలోనే పని చేసే ఆది అనే వ్యక్తి రేణును ఇష్టపడతాడు. మరి సచిన్ ప్రేమ సక్సెస్ అయిందా లేదా? సక్సెస్ అవడానికి హీరో ఏం ట్రై చేసాడు అనేది సినిమాలో చూడాలి.

- Advertisement -

90స్ దర్శకుడి డైలాగ్స్..
ఇక ప్రేమలు మూవీ తెలుగు వెర్షన్‍కు 90s ఎ ఫ్యామీలీ స్టోరీ వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ డైలాగ్స్ అందించాడు. ఇక అతను రాసిన డైలాగ్స్ ట్రెండ్‍కు తగ్గట్టు ట్రైలర్లో బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేమలు తెలుగు ట్రైలర్లో విజువల్స్ కంటే డైలాగ్స్ హైలైట్స్ గా నిలిచాయి. ట్రైలర్ చూస్తున్నంత సేపు ఎక్కడా పెద్దగా డబ్బింగ్‍ లా అనిపించలేదు. ఈ ట్రైలర్ ద్వారా ఆదిత్య హాసన్ తన మార్క్ చూపించాడనే చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్ల లో “ఫ్రెండ్స్ జోన్ అనేది కుమారి ఆంటీ లాంటిది రా.. పబ్లిసిటీ, పైసలు ఉంటాయి.. కానీ ప్రశాంతత ఉండదు” అంటూ ట్రెండ్ కి తగ్గట్టు చెప్ప్పిన డైలాగ్స్ హైలెట్ గా ఉంది.

ఇక ఈ ప్రేమలు చిత్రాన్ని మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, ఇంకా దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించగా, ఈ చిత్రంలో నెల్సన్ కే గఫూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రేమలు చిత్రానికి గిరీశ్ AD దర్శకత్వం వహించగా, విష్ణు విజయ్ సంగీతం అందించాడు. ప్రేమలు చిత్రం తెలుగు వెర్షన్ మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. ఇక ప్రేమలు మూవీలో శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షామీర్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు