Manjummel Boys : సొంత రాష్ట్రం కంటే అరవ రాష్ట్రంలో అదరగొడుతుంది!

టాలీవుడ్ లో భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు ఒకవైపు నిరాశ పరుస్తుంటే, మలయాళం ఇండస్ట్రీలో ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు మాత్రం ఓ రేంజ్ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతున్నాయి. నిజానికి కంటెంట్ బాగుంటే చిన్న సినిమా ఓయెద్ద సినిమా అన్న తేడా లేకుండా జనాలు ఆదరిస్తారని అక్కడి ఆడియన్స్ నిరూపించారు. నిజం చెప్పాలంటే అక్కడ కొన్నేళ్ల ముందు నుండి కూడా అక్కడ చిన్న సినిమాలే రాజ్యమేలుతున్నాయి. ఇక లాస్ట్ ఇయర్ చిన్న సినిమాగా రిలీజ్ అయిన 2018 సినిమా మలయాళం లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందన్న విషయం తెలిసిందే.

ఇక అసలు విషయానికి వస్తే..

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలలో మలయాళ ఇండస్ట్రీ నుండి వరుస పెట్టి సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఉన్నాయి. అయితే వాటిలో చిన్న సినిమాలు అనూహ్యంగా భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఎక్కువగా యూత్ కి సంబంధించిన లవ్ స్టోరీ లు కామెడీ డ్రామాలే ఉండడం విశేషం. ఇక అందులో రీసెంట్ గా రిలీజ్ అయిన “మంజుమ్మేల్ బాయ్స్” అనే సినిమా మాత్రం ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పటికే అరవై కోట్లకి పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ మంజుమ్మేల్ బాయ్స్ వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది.

- Advertisement -

కేరళ కంటే తమిళనాడులో ఎక్కువ..

ఇదిలా ఉండగా పది రోజుల కింద రిలీజ్ అయిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఒక పక్క కేరళలో భారీ వసూళ్లతో దుమ్ము లేపుతూ ఉండగా, మరో పక్క, పక్క రాష్ట్రం తమిళనాడులో సొంత రాష్ట్రాన్ని మించి మరో లెవల్ లో జోరు చూపిస్తూ ఏ మలయాళ సినిమా సాధించని రికార్డులను నమోదు చేస్తుంది మంజుమ్మేల్ బాయ్స్. అయితే గతంలో మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీ ఒకే రోజు తమిళనాడులో 2 కోట్లు వసూలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించగా రీసెంట్ గా ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన మంజుమ్మేల్ బాయ్స్ మూవీ ఇప్పుడు రెండో శుక్రవారం వర్కింగ్ డే లో కూడా అక్కడ చరిత్ర సృష్టించింది. అక్కడ ఎనిమిదో రోజు ఏకంగా 2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఒక్క రోజులో మళ్ళీ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇదే టైంలో కేరళలో మంజుమ్మేల్ బాయ్స్ రెండో శుక్రవారం 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటే, అరవ రాష్ట్రమైన తమిళనాడులో మాత్రం ఏకంగా 2 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ వీకెండ్ ఆదివారంతో మరింత రెచ్చిపోయి 5 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసే ఛాన్స్ ఉంది. ఇక లాంగ్ రన్ లో 100 కోట్లకి పైగా గ్రాస్ ఏ మలయాళ సినిమా కూడా సాధించని విధంగా దూసుకుపోతున్న మంజుమ్మేల్ బాయ్స్ పోటీగా మళ్ళీ ఏ సినిమా రాకపోతే 150 కోట్ల మార్క్ నైనా అందుకునే అవకాశం ఉంది. ఇక త్వరలో తెలుగులో కూడా డబ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు