Teja Sajja: అప్పుడు ప్రశాంత్ వర్మ కి అంత ఎలివేషన్ ఇచ్చావ్ కదా బ్రో

తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్నప్పుడే చాలామంది స్టార్ హీరోలతో నటించి, స్టార్ హీరోల సినిమాల్లో నటించి అద్భుతమైన పేరుని సాధించుకున్నాడు. అయితే ఎట్టకేలకు కొన్ని సంవత్సరాలు తర్వాత తాను చిన్నప్పుడు ప్రూవ్ చేసుకున్న ఫిలిం ఇండస్ట్రీలోని హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేశాడు. అయితే ఓ బేబీ సినిమాలో మొదట లీడ్ రోల్ లో కనిపించాడు తేజసజ్జ.

ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినా కూడా ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్లో వచ్చే సినిమాలకు మాత్రమే మంచి పేరు వచ్చింది. తేజ సజ్జ ఇదివరకే హనుమాన్ ఫంక్షన్ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ కి రాజమౌళి, రవితేజ కి పూరి జగన్నాథ్, తేజ సజ్జాకి ప్రశాంత్ వర్మ అని అంటూ చెప్పుకుని వచ్చాడు.

ఇకపోతే ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్లో వచ్చిన సినిమా హనుమాన్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ముందు చాలా తక్కువ థియేటర్లో రిలీజ్ అయింది. హైదరాబాద్ లో ఈ సినిమాకు చాలా తక్కువ థియేటర్స్ మాత్రమే దొరికాయి. కానీ ఈ సినిమా మంచి టాక్ సాధించడం వలన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాకు కూడా ఇంకొంచెం థియేటర్ల్ ను కేటాయించారు. అయితే సక్సెస్ఫుల్ గా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ సాధించింది ఈ సినిమా.

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా నిన్నటితో 50 రోజులను పూర్తి చేసుకుంది. దాదాపు 150 సెంటర్లో ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకుంది. చాలా రోజుల తర్వాత ఒక సినిమా 50 రోజులు ఆడటం కష్టం అనుకునే తరుణంలో సాధ్యం అని నిరూపించింది హనుమాన్ సినిమా.

అయితే హనుమాన్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో తేజ సజ్జ కి అద్భుతమైన పేరు వచ్చింది. అయితే ఈ సినిమా లాస్ట్ లో హనుమాన్ కనిపిస్తారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా రాబోతుంది. అయితే ఈ జై హనుమాన్ అనే సినిమాలో తేజ చేయాల్సిన పాత్రకి స్కోప్ చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఇకపోతే సినిమా రిలీజ్ కంటే ముందు ప్రశాంత్ వర్మ గురించి భారీ ఎలివేషన్లు ఇచ్చిన తేజ, నేడు 50 రోజులు ఫంక్షన్ లో మాత్రం కేవలం ఆడియన్స్ కి మాత్రమే థాంక్స్ చెప్తూ, 50 సెకండ్స్ మాత్రమే మాట్లాడి దిగిపోయాడు.

అయితే జై హనుమాన్ సినిమాలో తేజ పాత్ర తక్కువగా ఉండటం వల్ల కొంచెం అసంతృప్తితో ఉన్నాడని, వీళ్లిద్దరి మధ్య కొద్దిపాటి బేధాభిప్రాయాలు వచ్చాయని మాటలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయం గురించి ఓపెన్ గా చెప్తే గాని మనం ఒక క్లారిటీకి రాలేం.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు