Manjummel boys : వంద కోట్ల దిశగా చిన్న సినిమా..

టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత వచ్చిన ఏ సినిమాలు కూడా ఆశించినంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయాయి. అక్కడక్కడా కొన్ని చిన్న సినిమాలు ఆడినా, అవి ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే పొందాయి. అయితే ఇదే టైం లో మలయాళం ఇండస్ట్రీ మాత్రం వరుస విజయాలతో కళకళలాడుతుంది. మొన్న భ్రమయుగం, నిన్న ప్రేమలు, నేడు మంజుమెల్ బాయ్స్. వరుస హిట్లతో మలయాళం ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో షేక్ చేస్తుంది. మరో వైపు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మన సినిమాలు కనీస స్పందన తెచ్చుకోవడం లేదు. కానీ మలయాళం లో మాత్రం చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్నాయి.

చిన్న సినిమా పెద్ద విజయం..
తాజాగా మలయాళంలో రీసెంట్ గా హిట్ అయిన సినిమాలకి కనీసం 20 కోట్ల బడ్జెట్ కూడా కాలేదు. రీసెంట్ గానే మమ్మూట్టి భ్రమ యుగం 50 కోట్ల మార్క్ ని దాటేసి వంద కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. తాజాగా మరో సినిమా కూడా వంద కోట్ల వైపుగా అడుగులు వేస్తూ వార్తల్లో నిలుస్తుంది. చిదంబరం ఎస్ దర్శకత్వంలో రూపొందిన “మంజుమెల్ బాయ్స్” అనే చిన్న సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యి మౌత్ టాక్ తో దుమ్ములేపింది. అంతా చిన్న నటీనటులే నటించినప్పటికీ, పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజ్ అయినా కూడా మౌత్ టాక్ ఎఫెక్ట్ తో బాక్స్ ఆఫీస్ పై విజయభేరి మోగించింది ఈ సినిమా.

వంద కోట్ల దిశగా…

- Advertisement -

మంజుమెల్ బాయ్స్ చిదంబరం దర్శకత్వం లో తెరకెక్కగా, శోభున్ షాహిర్ నటించి నిర్మించడం జరిగింది. ఇక ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఫస్ట్ వీక్ కేవలం ఇండియా లోనే కేరళ తో పాటు, తమిళనాడు, కర్ణాటక ఏరియాల కలెక్షన్స్ తో కలిపి 55 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 65 కోట్ల వసూళ్లు దాటింది. ఇక రెండో వారం 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక మంజుమెల్ బాయ్స్ లో శోభున్ షాహిర్ తో పాటు, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్, అభిరాం ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి విశేష స్పందన తెచ్చుకుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు