Hanuman: హనుమ విహారం… సంచలనం

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో “హనుమాన్” చిత్రం చాలా ప్రత్యేకమైనది. స్టార్ హీరోల సినిమాల మధ్యలో ఓ సాధారణ మీడియం రేంజ్ సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించాడు. ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ మేకర్స్ దగ్గరుండి రిలీజ్ చేయడం జరిగింది. ఇక హనుమాన్ సినిమా ప్రీమియర్స్ నుండే సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోయింది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా వచ్చిన టాక్ ఈ సినిమాకు చాలా ప్లస్అయింది. ఇక హనుమాన్ సినిమాకు కృష్ణ సౌరబ్ అందించిన సంగీతం అతిపెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.

సంక్రాంతి విన్నర్..
సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా రిలీజ్ కాకముందు ఈ సినిమాకు థియేటర్ల కోసం మేకర్స్ ఎంత ట్రై చేసారో తెలిసిందే. పండక్కి వచ్చిన సినిమాలకు అన్ని సమానంగా పంచాలని ఈ సినిమాకి ఓ మోస్తరు థియేటర్లు ఇవ్వగా, రిలీజ్ అయిన తర్వాత రోజు నుండి మాత్రం బయ్యర్లు మాత్రం ఈ సినిమాకే ఎగబడ్డారు. ఇక ఆ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మీడియం రేంజ్ సినిమాగా తక్కువ థియేటర్లే దక్కించుకున్నా, ఆ తర్వాతి రోజు నుండి పెద్ద సినిమాలు ఉండి, థియేటర్లు ఖాళీ కావడంతో హనుమాన్ ని రీప్లేస్ చేసారు. ఇక హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 310 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఈ ఇయర్ వచ్చిన సినిమాల్లో ఇప్పటికి హనుమాన్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం.

హనుమాన్ యాభై రోజులు..

- Advertisement -

తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలవగా, తాజాగా ఓ అద్భుతమైన రికార్డు సాధించింది. సంక్రాంతి నుండి థియేటర్లలో రన్ అవుతున్న హనుమాన్ సినిమా తాజాగా 50 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అది కూడా ఏకంగా 150 థియేటర్లలో కావడం విశేషం. ఇందులో కొన్ని 2 షో లు ఉన్న థియేటర్లు కూడా ఉండగా, ఓవరాల్ గా వందకి పైగా థియేటర్లలో అంటే మామూలు విషయం కాదు. ఇంకా చాలా థియేటర్లలో హనుమాన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక టౌన్ ఊళ్లలో ఉన్న చిన్న థియేటర్లలో ఇప్పటికి హనుమాన్ సినిమా మళ్ళి రిలీజ్ చేయమని డిమాండ్ వస్తూ ఉంది. ఇక తాజాగా హనుమాన్ సినిమా ఓటిటి రిలీజ్ కి కూడా రెడీ అయింది. మహా శివరాత్రి కానుకగా మార్చి 8 నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జీ5 లో ప్రసారం అవుతుందని సమాచారం. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ ని కూడా తీయబోతున్న విషయం తెలిసిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు