Robin Hood : జెట్ స్పీడ్ తో షూటింగ్..

టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుముల నితిన్ కాంబోలో “రాబిన్ హుడ్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భీష్మ తర్వాత నితిన్ వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఆ మధ్య వచ్చిన టైటిల్ అనౌన్స్ మెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులు వేగవంతమయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై ఇంకా క్లారిటీ లేదు.

ఒక దొంగ..
దర్శకుడు వెంకీ కుడుముల నితిన్‌తో తీస్తున్న ఈ కొత్త చిత్రం కోసం సాహసోపేతమైన హీస్ట్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నాడని సమాచారం. ఈ సినిమాలో నితిన్ రాబరీలు చేసే ఒక దొంగ గా నటించబోతున్నాడన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా టీజర్ కూడా విపరీతమైన రెస్పాన్స్ అందుకోగా, గ్లింప్స్‌లో చూపించిన విధంగా ఈ చిత్రం బ్లాక్ హ్యూమర్‌ తో ఉంటుంది.

యాక్షన్ సన్నివేశాల్లో రాబిన్ హుడ్ బిజీ..
ఇక నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రెండు వారాల పాటు మున్నార్ లో షూటింగ్ జరుపుకోగా, తాజాగా రాబిన్‌హుడ్ అక్కడి నుండి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడని సమాచార. ప్రస్తుతం హైదరాబాద్ లో అద్భుతమైన ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. నితిన్ మరియు ఇతరులపై ఈ స్టంట్ సీక్వెన్స్‌ ను ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ద్వయం షూట్ చేస్తున్నారు. ఇక ఎంతో అనుభవం ఉన్న స్టంట్ డైరెక్టర్ల పర్యవేక్షణలో రాబిన్ హుడ్ యొక్క ఇంటర్వెల్ ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ లో చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది.

- Advertisement -

కం బ్యాక్ తప్పనిసరి..
మీడియం రేంజ్ హీరోల్లో ఒకడైన నితిన్ కి ఈ సారి హిట్టు కొట్టక తప్పని పరిస్థితి. కొన్నాళ్ల కిందట మినిమమ్ గ్యారెంటీ సినిమాలు చేసిన నితిన్, వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. తన తోటి హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతుంటే, వాళ్ళ కంటే ముందొచ్చిన నితిన్ మాత్రం వరుస ప్లాప్స్ తో తన మార్కెట్ ని కూడా డౌన్ చేసుకున్నాడు. అయితే ఈ రాబిన్ హుడ్ సినిమాతో ఎలాగైనా కం బ్యాక్ హిట్ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయించాలని చూస్తున్నాడు నితిన్. ఇక ఈ సినిమాలో శ్రీ లీల ని గాని, కృతి శెట్టిని గాని హీరోయిన్ గా తీసుకునే అవాకాశం ఉంది. అయితే ఈ ఇద్దరు హీరోయిన్లతో నితిన్ ప్లాప్ లు అందుకున్నాడు, అందువల్ల కొత్త హీరోయిన్లను తీసుకుంటే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నితిన్ కెరీర్ లో కూడా ఇదొక డిఫెరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ అవుతుందని దర్శకుడు వెంకీ కుడుముల ఓ సందర్భంలో చెప్పడం జరిగింది. మరి ఈ సినిమాతో నితిన్ కం బ్యాక్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు