Hanuman OTT : రికార్డ్ బ్రేకింగ్ కి సంసిద్ధం..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి ఓ మీడియం రేంజ్ సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భీభత్సం సృష్టించిన “హనుమాన్” మూవీ గురించి సినిమా ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ ఫిక్షనల్ డ్రామా సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలని అధిగమించి విన్నర్ గా నిలవడమే గాక, ఈ సంవత్సరం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ పై 300 కోట్ల భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులతో పాటు, హిందీ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు. అయితే రిలీజ్ కి ముందు విడుదల కావడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక, బయ్యర్లు నిర్మాతలని బతిమలాడి మరీ ఈ సినిమాను వేయించుకున్నారంటే హనుమన్ సినిమా ఏ రేంజ్ లో థియేటర్లలో ఆడిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికి సిటీలో కొన్ని థియేటర్లలో ఆడుతూనే ఉంది.

ఆడియన్స్ వెయిటింగ్..
అయితే హనుమాన్ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఆడియన్స్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమా థియేటర్లలో బాగా ఆడుతున్నందు వల్ల మేకర్స్ ఓటిటి రిలీజ్ ని పోస్టుపోన్ చేసారు. పైగా హనుమాన్ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా పెద్దగా సూపర్ హిట్ అనే రేంజ్ లో ఆడలేదు. అది హనుమాన్ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. అందుకే లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లు వసూలు చేసింది. అయితే ఎక్కడో ఉంది థియేటర్లో చూడలేకపోయిన చాలా మంది ఆడియన్స్, ఇంకా మరోసారి ఇంట్లో ఫ్యామిలీ తో హనుమాన్ దర్శనం చేసుకోవాలని ప్రేక్షకులు ఆత్రుతతో వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ డేట్ ఇస్తూ తాజాగా హనుమాన్ ఓటిటి రిలీజ్ అప్డేట్ వచ్చేసినట్టు తెలిసింది.

శివరాత్రి కానుకగా..

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని హనుమాన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు సినీ అభిమానులు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం “హనుమాన్” సినిమా ని మార్చి 8న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జీ5 లో ప్రసారం చేయనున్నారని తెలిసింది. మహాశివరాత్రి కానుకగా ఆరోజు నుండి హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. ఇక పండగ రోజు కాబట్టి ఆరోజు ఫ్యామిలీ ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ గా హనుమాన్ మారనుంది. అయితే మేకర్స్ నుండి అఫిషియల్ గా ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక అప్పటికే హనుమాన్ రిలీజ్ అయి 50 రోజులు దాటిపోతుంది కాబట్టి, ఇంకా లేట్ అయితే వ్యూయర్స్ కి ఇంట్రస్ట్ తగ్గే అవకాశం ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా హనుమాన్ ఓటిటి లోకి రాగానే ఇక్కడ కూడా రికార్డులు బద్దలవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ కూడా వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా 2025 తర్వాతే వస్తుందని సమాచారం. మధ్యలో దర్శకుడు ప్రశాంత్ వర్మ వేరే సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు