Relationship Tips : లవ్ లో ఉన్నా దాచే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు… మీరూ గమనించారా?

ఎప్పుడు, ఎవరితో, ఎవరు ప్రేమలో పడతారు అన్న విషయాన్ని ఎవ్వరూ కనీసం ఊహించలేరు. కొంతమంది తమకు తెలియకుండానే ప్రేమలో పడిపోతారు. అలాగే లవ్ చేయడానికి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా డీప్ లవ్ లో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని దాచి పెడుతూ ఉంటారు కొంతమంది. ప్రేమ వల్ల ఎదురయ్యే బాధను తట్టుకోవడం కష్టం అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్లు తమ ప్రేమను దాచి పెట్టడానికి ఎంత ప్రయత్నించినా, అది ఏదో ఒక రూపంలో బయట పడుతూనే ఉంటుంది. తమకు ఇష్టమైన వారికి దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళ ప్రవర్తనా తీరును బట్టి అసలు కథ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ప్రేమలో ఉన్నా, దాన్ని దాచి పెట్టేవాళ్ళలో కనిపించే లక్షణాలు ఏంటి అంటే..

1. ఆట పట్టించడం
సరదాగా ఆట పట్టించడం అనేది ప్రేమను వ్యక్తీకరించడానికి ఉపయోగించే ఒక మార్గం లాంటిది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పటికీ దాన్ని ఒప్పుకోని వాళ్ళు ఆటపట్టించే తీరు వ్యక్తిగతంగా మారుతుంది. అంటే మీ హాబీలు, మీ ఒపీనియన్… ఇలా మీకు నచ్చిన ఏ విషయాన్నైనా ఎగతాళి చేయవచ్చు.

2. సపోర్ట్
సాధారణంగా ప్రేమలో ఉన్నప్పుడు పార్ట్నర్ పై కేరింగ్ ఉంటుంది. అయితే తాము ప్రేమలో ఉన్నాము అనే విషయాన్ని ఒప్పుకోని వాళ్ళు తమకు ఇష్టమైన వాళ్లకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. తెలియకుండానే ఇష్టపడిన వాళ్లపై ఓవర్ కేరింగ్ గా ఉంటారు.

- Advertisement -

3. అప్రిసియేషన్స్
ఎవరైనా రహస్యంగా ప్రేమలో ఉన్నప్పుడు తమకు నచ్చిన వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని పాజిటివ్ పర్సెప్షన్ లోనే చూస్తారు. అందుకే వాళ్ళ బలాలు, వాళ్లలో ఉన్న ప్రత్యేక లక్షణాలు వంటి వాటిని ఇతరుల కంటే ఎక్కువగా గమనిస్తారు. అలాగే తరచుగా పొగడ్తల వర్షం కురిపిస్తారు. డైరెక్ట్ గా వాళ్ళ భావాలను వ్యక్తం చేయకుండా ప్రశంసల ద్వారా ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు.

4. బాడీ లాంగ్వేజ్
ప్రేమను దాచేవాళ్ళు ఆ విషయాన్ని ఒప్పుకోకపోయినా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మాత్రం ఈజీగా బయట పెట్టేస్తుంది. తమకు నచ్చిన వ్యక్తితో ఐ కాంటాక్ట్ ను ఎక్కువగా మైంటైన్ చేయడం, మాట్లాడడానికి ఎక్కువగా ఆసక్తిని కనపరచడం, వాళ్లను మిర్రరింగ్ చేయడం, మాట్లాడే సమయంలో ఎక్కువగా ముఖం లేదా మెడను తాకడం, వాళ్ళ జోకులకు ఎక్కువగా నవ్వడం, చేయి తాకడం వంటివి చేస్తారు.

5. అప్సెట్
సాధారణంగా మనం అప్సెట్ గా ఉన్నాము అనే విషయం మనకు బాగా దగ్గరైన వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే ప్రేమలో ఉండి కూడా ఆ విషయాన్ని ఒప్పుకోని వారు తమకు ఇష్టమైన వాళ్ళు అప్సెట్ గా ఉన్నారన్న విషయాన్ని ఈజీగా పసిగట్టేస్తారు.

6. చిన్న చిన్న విషయాలు ముఖ్యమే
ఇష్టమైన వ్యక్తికి సంబంధించిన చిన్న చిన్న విషయాల గురించి కూడా పట్టించుకుంటారు. ఎవరైనా రహస్యంగా ప్రేమలో ఉన్నప్పుడు తమకు ఇష్టమైన వారు ఇష్టపడే రంగు, కాఫీ వంటి ప్రతి చిన్న విషయాన్ని విలువైనదిగానే భావిస్తారు. అందుకే భద్రంగా మదిలో పదిల పరుచుకుంటారు.

7. ఎప్పుడూ చుట్టూనే
ఎవరైనా ప్రేమలో ఉన్నప్పుడు సహజంగానే తమ లవర్ కు దగ్గరగా ఉండాలని, వాళ్ళ చుట్టుపక్కల గడపాలని భావిస్తారు. అయితే ప్రేమలో ఉన్నామనే విషయాన్ని అంగీకరించలేని వాళ్లు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. తమకు ఇష్టమైన వారు ఎక్కడ ఉన్నా ఏదో ఒక రీజన్ తో అక్కడే ఉంటారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు