Life Style : అబ్బాయిలు జాగ్రత్త… లవర్ తో గొడవ పడినప్పుడు ఈ కామెంట్స్ చేస్తే అంతే సంగతులు

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు లవర్స్ మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ఆ గొడవ హద్దులు దాటి ఇగో హర్ట్ అయ్యి, బంధాన్ని తెంచుకునే వరకు వెళ్తుంది. కాబట్టి లవర్ తో గొడవ పడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత బాధపడిన ఏం ఉపయోగం ఉండదు. ముఖ్యంగా అబ్బాయిలు ఆ సీరియస్ టైంలో ఒక క్షణం ఆలోచించి మాట్లాడితే ఆ గొడవ అక్కడితోనే ఆగిపోతుంది. లవర్స్ ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు నోటికి వచ్చిన మాట అనేస్తే గట్టిగా హర్ట్ అవుతారు. మీ భావాలతో పాటు మీతో గొడవ పడుతున్న వారి భావాలను గౌరవించే విధంగా కమ్యూనికేట్ చేస్తే అది అక్కడితో సద్దుమణుగుతుంది. సైకాలజీ ప్రకారం ఎమోషనల్ గా మెచ్యూర్ గా ఉండే అబ్బాయిలు వాదనల సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా లవర్ తో బంధానికి ఎండ్ కార్డు వేసే ఇలాంటి కామెంట్స్ మాత్రం అస్సలు చేయరు.

1. నువ్వు ఎప్పటికీ లేదా ఎప్పుడూ…
గొడవ పడుతున్న సమయంలో ఎవరైనా సరే “నువ్వు ఎప్పటికీ” అనే కామెంట్ చేశారంటే అది అగ్నికి ఆజ్యం పోసినట్టే. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటావు, లేదా ఎప్పటికీ చేయలేవు అని అన్నట్టుగా ఉంటుంది. దీంతో అప్పటికే గొడవ కారణంగా మాంచి కోపం మీదున్న లవర్ మరింత హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

2. ఏమైనా లేదా ఏదైనా
లవర్ తో వాదన జరిగినప్పుడు వాట్ ఎవర్ అనే పదాన్ని ఉపయోగించారంటే అది నిరాకరణకు, నిరాదరణకు నిదర్శనంగా అనిపిస్తుంది. అంటే మీరు మీ లవర్ ను గౌరవంగా చూడట్లేదని, ఏమాత్రం విలువ ఇవ్వట్లేదని అనిపించేలా చేస్తుంది. దీంతో సమస్య పరిష్కారం కావడానికి బదులు మరింత తీవ్రతరం అవుతుంది.

- Advertisement -

3. కామ్ డౌన్
వాగ్వాదం జరిగినప్పుడు అబ్బాయిలు పొరపాటున కూడా కామ్ డౌన్ అని చెప్పకండి. అలా చెప్పారంటే అది కిరోసిన్ తో మంటలను ఆర్పడానికి ట్రై చేయడం లాంటిదే. ఆ పదం వల్ల అవతలి వ్యక్తి తమ భావాలకు మీరు విలువ ఇవ్వట్లేదని భావించవచ్చు.

4. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే…
నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే… అనే కామెంట్ చేయడం వల్ల మీ లవర్ ఎప్పటికీ మీకు నచ్చినట్టుగా ఉండాల్సిందే అని స్వయంగా మీరే ఒత్తిడి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అవుతుంది.

5. ఫ్యామిలీని గొడవలోకి లాగడం
సాధారణంగా లవర్స్ లేదా భార్య భర్తలు గొడవ పడినప్పుడు ఒకరి కుటుంబ సభ్యులను మరొకరు అందులోకి లాగుతూ ఉంటారు. కానీ దానివల్ల మీ పార్టనర్ బాధపడటం మాత్రమే కాదు, వాళ్ల వ్యక్తిగత, సున్నితమైన సంబంధాలను మీరు ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నట్టు. దీంతో పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇది మానసిక దాడి లాంటిది.

6. ఇకపై నేను పట్టించుకోను
ఇకపై నేను పట్టించుకోను… ఈ కామెంట్ ఈజీగా చేసేయొచ్చు. బాధగా లేదా నిరాశగా ఎలా చెప్పినప్పటికీ ఆ కామెంట్ అవతలి వ్యక్తిని దారుణంగా బాధ పెడుతుంది అనేది నిజం. ఇలా చెప్పేసి పరిస్థితి నుంచి తప్పించుకోవడం కంటే తమ భావాలను నిజాయితీగా కమ్యూనికేట్ చేయడమే బెటర్.

7. నేను మాట్లాడటం పూర్తయింది
గొడవ పడుతున్నప్పుడు ఇలాంటి డైలాగ్ చెప్పారంటే అది సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఎందుకంటే ఇలా చెప్పడం అనేది అవతలి వ్యక్తి ముఖం మీదే డోర్ క్లోజ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి దాని బదులు కొంచెం బ్రేక్ తీసుకొని, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ సమస్య గురించి మాట్లాడుకుందాం అని చెప్పడం బెటర్.

8. నువ్వు అతిగా స్పందిస్తున్నావు
నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అని కామెంట్ చేస్తే అంతే సంగతులు. ఆ పరిస్థితిలో ఈ కామెంట్ చేస్తే మరింత నెగిటివ్ గా మారుతుంది. పైగా అవతల వ్యక్తిని కించపరిచినట్టుగా ఉంటుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు