RC16 Update: ఇండియన్ హెర్కులస్‌గా రామ్ చరణ్… బుచ్చిబాబు ప్లాన్‌కు ఫిదా..

RC16 Update

ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్… ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2 సినిమా వల్ల ఆలస్యమైన ఈ చిత్రం… ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఓ సందర్భంలో చెప్పాడు. ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే రామ్ చరణ్ మరో సినిమాకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్.. RC16 ను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని, ఇప్పటికే లుక్ టెస్ట్ షూట్ కూడా జరిగిపోయిందని ఇండస్ట్రీలో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్లాట్ గురించి ఆసక్తికరమైన టాపిక్ చక్కర్లు కొడుతుంది. RC16 ఓ బయోపిక్ మూవీ అని తెలుస్తుంది. ఇండియన్ హెర్కులస్ గా పేరున్న కోడి రామమూర్తి జీవిత కథను RC16లో బుచ్చిబాబు చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

Ram Charan starrer RC16 is a biopic of Kodi Rammurthy

- Advertisement -

కళియుగ భిమూడు అనే పేరున్న కోడి రామమూర్తి శ్రీకాకులం జిల్లాకు చెందిన వాడు. ఇతన్ని విదేశియులు ఇండియన్ హెర్కులస్ గా పిలిచే వారు. అయితే ఆయన జీవిత కథలోని సంఘటనలను తీసుకున్ని, కొన్ని కల్పిత స్టోరీని యాడ్ చేసి బుచ్చి బాబు RC16 మూవీని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

ఇదే నిజం అయితే, RC16 మూవీలో రామ్ చరణ్ కండల వీరుడిలా కనిపించే ఛాన్స్ ఉంది. అలాగే కుస్తీ పడుతూ… మాస్ లుక్ లో కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు