Ram Charan : బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్న గ్లోబల్ స్టార్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ షణ్ముగం దర్శకత్వం లో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో ఓ పాన్ ఇండియా సినిమా తీయనున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఓ విలేజ్ డ్రామా అని సమాచారం. అయితే ఈ సినిమా మొదలవ్వాలంటే ఏప్రిల్ లోనే. అయితే ఈ సినిమాలు సెట్స్ పై ఉండగానే మరిన్ని పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు గ్లోబల్ స్టార్. ఈ క్రమంలో రామ్ చరణ్ బాలీవుడ్ సినిమా చేయనున్నట్టు సమాచారం.

రీసెంట్ గానే ఓ కథ విన్న రామ్ చరణ్ ఓ బాలీవుడ్ సినిమా కు సైన్ చేసాడని, అది కూడా బాలీవుడ్ దర్శకుడితో, బాలీవుడ్ మేకర్స్ తోనే ఆ సినిమా తీయనున్నట్టు తెలుస్తుంది. అయితే పదేళ్ల ముందు తొందరపాటుతో డైరెక్టర్ గురించి కూడా తెలుసుకోకుండా రామ్ చరణ్ హిందీలో తుఫాన్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో ఎంత డిజాస్టర్ అయిందో, అంతకంటే ఎక్కువగా రామ్ చరణ్ పై ట్రోల్ చేసారు, ముఖ్యంగా బాలీవుడ్ నెటిజన్లు చరణ్ యాక్టింగ్ పై తీవ్ర విమర్శలు చేసారు. ఆ తరువాత రంగస్థలం, RRR వంటి సినిమాలతో రామ్ చరణ్ బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించి అక్కడి నెటిజన్ల నోరు మూయించాడు.

అయితే అంత మాత్రాన బాలీవుడ్ లో మళ్ళి సినిమా చేయడం అవసరమా అని తెలుగు ట్రేడ్ విశ్లేషకులు అంటున్న మాట. ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ రెండేళ్లు గ్యాప్ తీసుకోగా, చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు సినిమాల రిలీజ్ డేట్లపై క్లారిటీ కూడా రాలేదు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మరి రామ్ చరణ్ బాలీవుడ్ సినిమా అంటూ వస్తున్న ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు