Buchibabu : RC16 నుండి సాలిడ్ అప్డేట్.. ‘శివన్న’ కీ రోల్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ‘గేమ్ ఛేంజర్’ లో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ కావడానికి మరో ఆరు నెలలు పట్టేట్టు ఉంది. అందుకే రామ్ చరణ్ బుచ్చిబాబు తో చేస్తున్న RC16 ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ జనవరిలో ఓపెనింగ్ జరుపుకుని మార్చ్ లో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సినిమాలో నటీనటులను తీసుకునే పనిలో పడ్డాడు దర్శకుడు బుచ్చిబాబు.

ఇదిలా ఉండగా RC16 మూవీ పై ఒక సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసింది. ఈ అప్డేట్ స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని ఈ సినిమాలో తన పాత్ర కొత్తగా ఉంటుందని చెప్పారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో కూడా కంఫర్మ్ కాలేదు కానీ, సినిమాలో సాలిడ్ రోల్ లో శివన్న నటిస్తున్నాడని తెలియగానే రాంచరణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేయడం మొదలెట్టారు.

అయితే ఈ సినిమా 80స్ బ్యాక్ డ్రాప్ లో ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా కాగా తెరకెక్కుతుండగా సినిమా 2025 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత అంతకు మించి ఇంపాక్ట్ ఇచ్చే పాత్ర లో నటిస్తున్నారని బుచ్చిబాబు పలుమార్లు చెప్పడం జరిగింది.

- Advertisement -

For More Updates :Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు