Mythri Movie Makers: జనవరి నుండి సెట్స్ పైకి RC16.. అంత లేటెందుకు?

Mythri movie makers Rc16:

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శంకర్ చాలాయేళ్ల తర్వాత పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తుండడంతో దీనిపై క్రేజీ బజ్ ఉంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సాన తో ఒక సినిమా చేయనున్నాడన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిచబోయే ఈ సినిమాను 2024లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారు.

అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ జరిగినా, ఇప్పటివరకు ఓపెనింగ్ కూడా జరగలేదు. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే చరణ్ తో చేయబోయే ఈ సినిమాను సెప్టెంబర్ లో గ్రాండ్ గా ప్రారంభించనున్నారని తెలిసింది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మాత్రం జనవరిలోనే ప్రారంభించనున్నారని సమాచారం.

అయితే అభిమానులు మాత్రం ఇంత సెప్టెంబర్ లో మొదలయ్యే ఈ సినిమాని జనవరి నుండి రెగ్యులర్ షూట్ ఎందుకు స్టార్ట్ చేస్తారని ఎదురవుతున్న ప్రశ్న. దీన్ని బట్టి గేమ్ ఛేంజర్ షూటింగ్ బాలన్స్ ఇంకా చాలా ఉందేమోనని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. RC16 స్టార్ట్ అవ్వడమే అంత టైం తీసుకుంటే రిలీజ్ చేయడానికి 2025 వరకు తీసుకెళ్తారా అని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఓపెనింగ్ జరిగాకే మిగతా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. ఈ లోపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు