RC16: చరణ్ బుచ్చి బాబు సినిమా కి ఆస్కార్ విన్నర్ ?

ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వం లో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు 200 కోట్ల భారీ బడ్జెట్ నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమా కు సంగీతం అందిస్తున్నాడు. మార్చి 27 న రామ్ చరణ్ బర్త్ డే రోజు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. పైగా షూటింగ్ లో లీకైన స్టిల్స్ కూడా అంచనాల్ని పెంచేసాయి. ఇందులో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, ఒక రాజకీయ నాయకుడిగా రెండు పాత్రలు చేస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం షూట్ కంప్లీట్ అయిన సినిమా 2024 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు తో RC16 సినిమా చేస్తున్నాడు. రంగస్థలం లాగా ఈ సినిమా కూడా ఒక మట్టి మనిషి కథ అని, పల్లెటూరి లో జరిగే స్టోరీ అని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఇంకా స్టార్ట్ కానీ ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుతోంది. అయితే ఈ సినిమా కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

అదేంటంటే RC16 మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ.ఆర్ రహమాన్ కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే బుచ్చి బాబు, నిర్మాత నవీన్ యెర్నేని రహమాన్ ని కలిసినట్టు మ్యూజిక్ విషయంలో చర్చలు జరిపినట్టు, ఆ విషయం రామ్ చరణ్ కి కూడా చెప్పి ఓకే చేయించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇది నిజమే అని భావించి కన్ఫర్మ్ చేసుకొని సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తున్నారు. ఒక వేళ ఇది నిజమే అయితే సెన్సషనల్ న్యూస్ అనే చెప్పవచ్చు. మరి ఈ వార్త నిజమో కాదో మూవీ యూనిట్ నుంచి అఫిషియల్ గా వచ్చే వరకు ఎదురు చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు