Allu Arjun: పుష్పని పార్టీ అడిగిన తారక్.. మరి ఇచ్చాడా ?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టిన రోజు ఏప్రిల్ 8 న జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో బర్త్ డే వేడుకని జరుపుకోగా, ఈ సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న పుష్ప 2 ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్ ను ఒక రోజు ముందుగానే శుక్రవారం రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోని సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక అల్లు అర్జున్ కు పలువురు ప్రేక్షకులు, అభిమానులు, సెలెబ్రిటీలు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ ని తెలియచేశారు. రామ్ చరణ్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా చాలా మంది వారి ట్విట్టర్ అకౌంట్స్ లో విష్ చేశారు.

ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నిన్న రాత్రి తన ట్విట్టర్ ద్వారా ‘హ్యాపీ బర్త్ డే బావా’ అంటూ అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ ని స్పెషల్ గా చెప్పారు. అయితే దానికి రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్ ‘థ్యాంక్ యు వెరీ మచ్ బావ’ ‘నీకు హ్యాపీ హగ్స్’ అని ట్వీట్ చేశాడు. దీనికి మళ్ళీ “కేవలం హగ్స్ మాత్రమేనా పార్టీ లేదా పుష్ప” అంటూ ఎన్టీఆర్ దానికి పుష్ప డైలాగ్ లా రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి వెంటనే స్పందించిన అల్లు అర్జున్, “వస్తున్నా” ఎన్టీఆర్30 ఫస్ట్ లుక్ లోని డైలాగ్ ని గుర్తుచేస్తూ అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు.

మొత్తంగా ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ మధ్య జరిగిన ఈ సరదా ట్వీట్ల సంభాషణ అటు అల్లు ఫ్యాన్స్ తో పాటు ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎంతో ఆనందాన్ని నింపింది. సోషల్ మీడియా లో వీరి మధ్య ఇంత క్లోజ్ బాండింగ్ ఆ.. అంటూ ఆశ్యర్యపోతున్నారు. కాగా ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు