Jahnavi kapoor :టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు

టాలీవుడ్ లో ఒకటి,రెండు సినిమాలు చేసి బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అవ్వాలి అనేది మన తెలుగు హీరోయిన్ లకి ఉండే కల . అది నిజం చేస్తూ శ్రీదేవి మొదలుకొని నిన్న, మొన్న వచ్చిన తెలుగు హీరోయిన్ లు కూడా బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయ్యారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మన తెలుగు సినిమా మార్కెట్ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. మన సినిమాలకి గ్లోబల్ రెకాగ్నేషన్ వచ్చింది. దాంతో బాలీవుడ్ హీరోయిన్ లు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

సౌత్ సినిమా అని చెప్పగానే డేట్స్ ఇచ్ఛేస్తున్నారు. అలియా భట్, జాన్వీ కపూర్, అనన్య పాండే లాంటి హీరోయిన్ లు అయితే తెలుగు సినిమా చేయడం లక్కీ లాటరీగా ఫీల్ అవుతున్నారు. అయితే విషయానికొస్తే బుచ్చి బాబు దర్శకత్వం లో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ ఫాస్ట్, ఫాస్ట్ గా జరుగుతున్నాయి. “గేమ్ చేంజర్”మూవీకి సంబంధించి షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోతుండటంతో బుచ్చి బాబు సినిమా పనులు మొదలయ్యాయి.

RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా డైరెక్టర్ బుచ్చిబాబు స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకోబోతున్నారంట. రీసెంట్ గానే బుచ్చి బాబు ఆమెని కలిసి కథ వినిపించరంట జాన్వీ కపూర్ వెంటనే ఎక్సయిట్ అయ్యి ఒకే చెప్పిందట. ఇప్పటికే జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ 30 చేస్తున్నారు. అంతలోనే చరణ్ సినిమా కమిట్ అయ్యారని టాక్. ఇలాగే ఉంటే జాన్వీ ఇక తెలుగు సినిమాలలో బిజీ అవ్వడం ఖాయం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు