Ustaad Bhagat Singh: ప్రకంపనలు సృష్టిస్తున్న PK సినిమా లీకిడ్ స్టిల్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోద సితం రీమేక్, ఇంకా సుజిత్ తీస్తున్న ‘ఓజి’ లో నటిస్తున్నాడు. ఇటు జనసేన పార్టీ పనుల్లో ఇతర కార్యకలాపాల్లో కొనసాగుతూనే వీలైనప్పుడల్లా ఈ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. అయితే ఎప్పుడో మూడేళ్ళ కిందట స్టార్ట్ అయిన హరిహరవీరమల్లు షూట్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ సముద్రఖని సినిమా షూట్ లో మొన్నటి వరకు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇప్పడు హరీష్ శంకర్ తో చేస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

అయితే ఈ సినిమా 2024 లో విడుదల అవుతుంది. గబ్బర్ సింగ్ విడుదలైన 11 ఏళ్ళ తరువాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో మూవీ వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్యనే స్టార్ట్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ‘ఇర్రం మంజిల్’ లో PVR లో షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే తాజాగా ఈ షూట్ నుండి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. లుంగీ లో ఉన్న పవన్ కళ్యాణ్ స్టిల్స్ అదిరిపోయాయి. గడ్డం తో రఫ్ లుక్ తో ఉన్న కళ్యాణ్ పై యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పుడు షూట్ చేస్తున్నారు. లీకైన స్టిల్స్ లో కొంతమంది ముస్లిం వేషధారణ లో ఎవరి కోసమో గొడవ చేస్తున్నట్టు ఉంది. అంతే కాదు ఒక వైపున వస్తాద్ లు చేసే కసరత్తు సామాన్లు, ఇంకా ఆయుధాలు కూడా ఉన్నాయి.

- Advertisement -

ఏది ఏమైనా లీకైన స్టిల్స్ ఫ్యాన్స్ కి కిక్కిస్తుంటే మూవీ యూనిట్ కి మాత్రం చాలా ఇబ్బందులు తెస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు