War-2: తారక్‌తో రోమాన్స్ చేయడానికి బాలీవుడ్ బ్యూటీ

ఇటీవలే YRF సంస్థ ఎనౌన్స్ చేసిన స్పై థ్రిల్లర్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ వచ్చింది. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్నారనే వార్త గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కానీ ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండబోతుంది అనేది పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే వార్ -2 మల్టీస్టారర్ సినిమా. ఇప్పటికే RRRతో ఒక మల్టీ స్టారర్ సినిమా చేసిన ఎన్టీఆర్. మళ్ళీ ఇంకో మల్టీ స్టారర్ సినిమా కమిట్ అవుతుండడం తో ఫ్యాన్స్ లో ఇన్సెక్యూరిటీ మొదలయింది. కారణం మల్టీ స్టారర్ సినిమా అంటే కనిపించే రెండు పాత్రలు సమానంగా చూపించాలి.

ఎక్కువలు తక్కువలు ఏమైనా ఉంటె ఆ పాత్రకి సంబంధించి రూట్స్ లో డెప్త్ అయినా ఉండాలి. ఏ కొంచెం అటు, ఇటు అయినా కూడా మా హీరో ని తక్కువ చేసి చూపించారు అనే కామెంట్స్ వస్తాయి. బాలీవుడ్ లో మల్టీ స్టారర్ లు సాధారణంగా వస్తూనే ఉంటాయి కాబట్టి ఇలాంటివేవీ పట్టించుకోకుండా, వాళ్ళు ఎలా తీస్తె అలా చూడడానికి అక్కడి ప్రేక్షకులు అలవాటు పడిపోయారు.

కానీ మన తెలుగులో ఈ పరిస్థితి లేదు. ఏ కొంచెం తేడా వచ్చిన మా హీరో ఇలా చూపిస్తారా అంటూ హుంగామా చేస్తారు. RRRకి కూడా ఇలాంటి సమస్య తలెత్తింది. మరో పక్క ఈ మధ్య వస్తున్న బాలీవుడ్ సినిమాల్లో కథ, కథనాల్ని పక్కన పెట్టి యాక్షన్, రొమాన్స్, ఐటెం సాంగ్స్ పైనే మేకర్స్ కాన్సంట్రేషన్ పెడుతున్నారు. ఇలాంటి సమయం లో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ, అందులోను మల్టీ స్టారర్ , అది కూడా ఆల్రెడీ చేసిన మూవీకి సెకండ్ పార్ట్ కావడంతో ఫ్యాన్స్ లో ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయింది.

- Advertisement -

ఇదిలా ఉండగా ఫ్యాన్స్ ఊరట కలిగించే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అది ఏంటంటే ఎన్టీఆర్ కి జోడిగా వార్-2లో అలియా భట్ నటించబోతుందంట. వాస్తవానికి ఎన్టీఆర్30 లోనే ఆలియా చెయ్యాల్సి ఉండే, కానీ తన మ్యారేజ్ కారణంగా NTR30 ప్రాజెక్ట్ లో తన పాత్రను క్యాన్సిల్ చేసుకుంది. దాంతో ఫ్యాన్స్ కి ఎన్టీఆర్-ఆలియా కాంబో మళ్ళీ, ఎప్పటికి సెట్ అవుతుందో అనుకునే లోపు వార్-2 ఆలియా చేస్తుంది అనే న్యూస్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తోంది

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు