Ponniyin selvan 2: PS 2 నుండి రెండో పాట రిలీజ్.. శోభిత ధూళిపాళ స్పెషల్ అట్రాక్షన్

పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2.. తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న మూవీ. పార్ట్ 1 తో భారీ విజయం తో పాటు ట్విస్ట్ లను, సస్పెన్స్ లను అలాగే ఉంచి సెకండ్ పార్ట్ మీద అంచనాలు పెంచేసాడు. మణిరత్నం భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఆదిత్య కరికాలుడిగా విక్రమ్, నందిని గా ఐశ్వర్య రాయ్, వల్లవరాయన్ గా కార్తీ, కుందవాయి గా త్రిష, పొన్నియన్ సెల్వన్ గా యువరాజు పాత్రలో జయం రవి, వానతి గా శోభిత ధూళిపాళనటించారు. ఇంకా ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ఐశ్వర్య లక్ష్మి, , జయరాం, రెహమాన్, పార్తీబన్, ప్రభు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఏ. ఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఏప్రిల్ 28న విడుదలవబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. రెండు మూడు రోజులకో అప్డేట్ ఇస్తూ నెమ్మదిగా సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా లోని రెండో పాట విడుదలైంది. ఈ పాట ఒక యుగళ గీతం లా ఉండి, యువరాజు పొన్నియన్ సెల్వన్ ని కీర్తిస్తూ జయం రవి, శోభిత ధూళిపాళ మధ్యలో సాగుతుంది. శోభిత ఈ పాటలో చాలా అందంగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పాటలోని కొన్ని స్టిల్స్ ని చూస్తుంటే సినిమాలో పొన్నియన్ సెల్వన్ కి యువరాణి వానతి (శోభిత) కి పెళ్లి అయినట్టు ఈ పాటలో చూపించారు. మరి ఇది సినిమాలో భాగమా, లేక హీరోయిన్ పెళ్లయినట్టు ఊహించుకుందా అనేది తెలియాలి.

- Advertisement -

ఈ పాట యొక్క తెలుగు లిరిక్స్ ని చంద్రబోస్ రాయగా ఈ పాటని శంకర్ మహదేవన్, చిన్మయి శ్రీపాద కలిసి పాడారు. ఇక ఈ సినిమా లో మొదటి పాట కార్తీ, త్రిష ల మధ్య ఉండగా, రెండో పాట జయం రవి, శోభిత ధూళిపాళ మధ్య ఉంది. మరి మూడో పాట బహుశా విక్రమ్, ఐశ్వర్య ల మధ్య వస్తుందేమో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు