Pushpa 2: గరికపాటికి సుకుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ సినిమా తెరకెక్కుతోంది. అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే శుక్రవారం పుష్ప 2 ది రూల్ సినిమా నుంచి వేర్ ఇస్ పుష్ప అనే వీడియోను విడుదల చేశారు. అయితే పుష్ప లో స్మగ్లర్ గా కనిపించిన పుష్పాను అందరూ విలన్ అనుకున్నారు. ఎర్రచందనం దొంగల దొంగతనంలో పుష్పకు వచ్చిన కోట్ల డబ్బుతో ఏం చేశాడు అన్నది రెండో పార్ట్ లో చూపించారు.

తాజాగా విడుదలైన పుష్ప టీజర్ లో… పుష్పను పోలీసులు వెంటాడడం, అడవుల్లో పారిపోవడం, ఆ తర్వాత అతని చొక్కాపై ఎనిమిది బుల్లెట్లతో కనిపించడం, పుష్ప బాడి దొరకపోవడంతో చిత్తూరు జిల్లా మొత్తం అట్టుడికిపోతోంది. జనాలంతా పుష్ప కోసం స్వయంగా ఆందోళనలు చేయడం చూపించారు. అతడు చేసిన గుండె ఆపరేషన్లు, పెళ్లిళ్లు, సాయాలను జనాలకు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ గుండెల్లో పుష్ప నిలిచిపోయారు అన్నట్టుగా చూపించారు. పుష్ప బతకాలని పూజలు చేసి కోరుకునే జనాల అభిమానాన్ని చూపించారు.

అంటే సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ ను సుకుమార్ హీరోగా చూపించారని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, మొదటి పార్ట్ లో అల్లు అర్జున్ స్మగ్లింగ్ అంటూ విలన్ లా కనిపించాడని గరికపాటి నరసింహారావు సంచలన కామెంట్స్ చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వచ్చిన టీజర్ లో పుష్ప విలన్ కాదు హీరో అని… జనాల కోసమే ఆ ఎర్రచందనం డబ్బు ఖర్చు చేశాడని… వారి ఆకలి అవసరాలు తీర్చాడు అని అర్థమైంది. దీంతో గరికపాటికి సుకుమార్ ఈ టీజర్ తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు