Raviteja: రవితేజ కొడుకు హీరోగా సక్సెస్ అయినట్టేనా..?

Raviteja.. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి చాలామంది సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారసులు అడుగుపెట్టి అందులో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంత మంది ఒకటి రెండు చిత్రాలకే పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నిర్మాతలు, హీరోలు , డైరెక్టర్ల వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటుతున్నారు. అందులో భాగంగానే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన కంటూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న రవితేజ.. తాజాగా తన తమ్ముడి కొడుకును ఇండస్ట్రీలోకి హీరోగా లాంచ్ చేశారు.

Raviteja: Is Raviteja's son successful as a hero?
Raviteja: Is Raviteja’s son successful as a hero?

రవితేజ ఫ్యామిలీ నుండి వారసుడు..

ప్రస్తుతం రవితేజ.. హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తొందరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఇదిలా ఉండగా ప్రస్తుతం రవితేజ తమ్ముడైన రఘు.. ఇతని కొడుకు మాధవ్ హీరోగా ఇంట్రెస్ట్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు.. ‘మిస్టర్ ఇడియట్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు చిత్ర బృందం.. ఈ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.. మరి రవితేజ ఫ్యామిలీ నుండి వస్తున్న ఈ హీరో సక్సెస్ అవుతారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి..

మిస్టర్ ఇడియట్ గా మాధవ్..

ఇకపోతే రవితేజ కి ఇడియట్ సినిమా ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ లోనే ఇడియట్ సినిమా పేరు కలిసేలాగా మిస్టర్ అని పెట్టడం ఈ సినిమాకు మరింత కలిసి వచ్చేలాగా కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక రవితేజ సోలోగా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. రవితేజ లాగే మాధవ్ కూడా చాలా కాలం ఇండస్ట్రీలో కొనసాగుతారా లేక రెండు మూడు సినిమాలకే పరిమితం అవుతారా అనే విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -

తమ్ముడి కొడుకు కోసం రవితేజ ప్రయత్నం..

ఇక ప్రస్తుతం రవితేజ ఈ సినిమా యూనిట్ కి సపోర్ట్ చేస్తూ వాళ్లను ముందుకు వెళ్లేలా ప్రమోట్ చేస్తున్నారు.. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఇదే సపోర్ట్ ని కొనసాగిస్తూ మాధవ్ కి సక్సెస్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి.. వారికి అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు రవితేజ కూడా తన తమ్ముడి కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసి అతడి సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రవితేజ సపోర్ట్ మేరకు మాధవ్ ఏ విధంగా సక్సెస్ అందుకుంటారో చూడాలి.

రవితేజ సినిమాలు..

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్న ఈయన ఈ వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ ఎంతోమంది హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు పారితోషకం విషయంలో కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దూసుకుపోతున్న రవితేజ ప్రేక్షకులను మరిన్ని చిత్రాలతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు