Allu Arjun: బహిరంగంగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్.. కానీ వైసీపీ కోసం..!

Allu Arjun.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలి అంటూ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేస్తున్నారు. ఇక చిరంజీవిని మొదలుకొని నిహారిక , రామ్ చరణ్ మెగా కుటుంబ సభ్యులు ఇలా పలువురు సోషల్ మీడియా ద్వారా మద్దతు పలుకుతూ.. పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న విషయం తెలిసిందే.. అయితే అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కి అండగా నిలుస్తానని ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు వైసీపీకి ఆయన మద్దతు పలుకుతూ ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Allu Arjun: Openly supports Pawan Kalyan.. but for YCP..!
Allu Arjun: Openly supports Pawan Kalyan.. but for YCP..!

పవన్ కి మద్దతుగా కానీ వైసీపీకి సపోర్ట్..

అసలు విషయంలోకి వెళితే.. అల్లు అర్జున్ తన మామ పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా మద్దతు ఇచ్చి.. ఇప్పుడు తన స్నేహితుడైన నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవిచంద్ర కిషోర్ రెడ్డికి కూడా శుభాకాంక్షలు తెలిపేందుకు తన భార్య స్నేహ రెడ్డితో ఈరోజు ఉదయం నంద్యాలకు చేరుకోనున్నారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎలక్షన్ క్యాంపెయిన్ తన భార్యతో కలిసి చేస్తారా? లేదా? అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది . ఏది ఏమైనా తన స్నేహితుడి కోసం అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

పవన్ ఫ్యాన్స్ ఫైర్..

అయితే ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటానని కామెంట్ చేసి ఇప్పుడు వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాలకు వెళ్లడం ఏమాత్రం సమంజసంగా లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. అయితే దీనిని మాత్రం అల్లు అభిమానులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు అక్కడ అండగా నిలబడుతున్నారు. ఇప్పుడు నంద్యాలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడైన వైసిపి అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి తన మద్దతు ప్రకటిస్తున్నారు.. ఇందులో తప్పు ఏముంది.. ఇద్దరూ ఒకే నియోజకవర్గము నుండి పోటీ చేస్తూ ఉంటే అప్పుడు ఈయన సపోర్ట్ చేసి ఉంటే అది తప్పు.. అలా జరిగినప్పుడు అల్లు అర్జున్ తప్పేముంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఏదైనా విభేదాలు ఏర్పడతాయోమనని కొంతమంది సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇక అల్లు అర్జున్ సినిమాలు..

అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మళ్ళీ అలవైకుంఠపురంలో కాంబినేషన్ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది.. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందట.. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు