Pushpa The Rule: పుష్ప గోరువెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన హైట్రిక్ చిత్రం “పుష్ప ది రైజ్”. ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. ఇక “పుష్ప ది రూల్” కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా “వేర్ ఈజ్ పుష్ప” అంటూ విడుదల చేసిన టీజర్ ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 కి సంబంధించిన టీజర్ పైనే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా టీజర్ లో అల్లు అర్జున్ అడవిలో పులుల కోసం పెట్టిన ఓ నైట్ విజన్ కెమెరాలో క్లిక్ అవుతాడు. ఈ క్రమంలో జూమ్ చేసి చూడగా అది పుష్ప అని జనాలకు అర్థమవుతుంది. అక్కడ పుష్ప తన ట్రేడ్ మార్క్ స్టైల్ లో గడ్డం నిమురుకుంటుండగా అప్పుడు తన చిటికెన వేలు మాత్రం నెయిల్ పాలిష్ తో లేడీస్ తరహాలో కనిపిస్తుంది.

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో పుష్ప శత్రువులను చెండాడేందుకు మారువేషంలో అమ్మోరు లాగా, చీర కట్టుకొని ఒంటినిండా నగలు పెట్టుకుని కనిపిస్తాడు. ఈ లుక్ లో అల్లు అర్జున్ చాలా బోల్డ్ గా లేడీ గెటప్ లో ఉంటాడు. అయితే మొత్తంగా ఇవన్నీ గమనిస్తే అల్లు అర్జున్ ఈ సినిమాలో ఎక్కువగా మారువేశాలలో ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుష్ప పోలీసుల దగ్గర నుండి తప్పించుకొని సినిమా కథను ముందుకు తీసుకువెళతాడని బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే బన్నీ గోరుకి ఉన్న రంగు ఆధారంగా ఈ సినిమాలో హిజ్రా పాత్రలో కూడా నటించాడని, తన కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా చేయబోతున్నాడు అంటూ అభిమానులు ఓవర్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పుడు ఈ టీజర్ మొత్తంగా చిటికెన వేలు గోరు ప్రస్తుతం హైలెట్ అవుతుంది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు